దళితబంధుపై హైకోర్టులో పిల్ : కొందరికే లబ్ధి రాజ్యాంగానికి విరుద్ధం

దళితబంధుపై హైకోర్టులో పిల్ : కొందరికే లబ్ధి రాజ్యాంగానికి విరుద్ధం

హైదరాబాద్ : దళితబంధు స్కీమ్ లో ఎమ్మెల్యేలు, అధికారుల ప్రమేయం, వారి సిఫార్సులు ఉండకూడదని దాఖలైన పిల్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఆగస్టు 30న) విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేలు, అధికారుల సిఫార్సు మేరకు దళితబంధు అర్హులను సెలెక్ట్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని పిల్ లో వివరించారు. రాబోయే ఎన్నికల సందర్భంగా దళితబంధు అర్హులను ఎంపిక చేస్తున్నారని హైకోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది.

ALSO READ:బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది : అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దళితబంధు లిస్టుల్లో ఎమ్మెల్యేల అనుచరులకే పథకం వర్తింపజేస్తున్నారని, మిగతా వారిని పట్టించుకోవడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.