కేయూలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

కేయూలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

హనుమకొండ, కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజెస్ అథ్లెటిక్స్ చాంపియన్ ​షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. వీసీ తాటికొండ రమేశ్, స్పోర్ట్స్ బోర్డ్​ఆఫీసర్లు చీఫ్ గెస్టులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రమేశ్ మాట్లాడుతూ.. ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ఆటలు ఉపయోగపడతాయన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో పోటీలు జరిగాయి. కాగా విమెన్​ 1500 మీటర్ల పరుగు పందెంలో వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్​ స్టూడెంట్​ ఎం.కావ్య మొదటి స్థానంలో నిలవగా.. ఖమ్మం ఎస్​ ఆర్​ అండ్​ బీజీఎస్​ఆర్ కాలేజీకి చెందిన షేక్​ సమ్రీన్​, మంచిర్యాల సీవీ రామన్​ కాలేజీకి చెందిన జే.హనీ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో ఖమ్మం ఎస్​ఆర్​ అండ్​ బీజీఎస్​ఆర్​ కాలేజీకి చెందిన వి.రాజు, వి.జ్ఞానేశ్వర్​ మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఆదిలాబాద్​ మహర్షి కాలేజీ స్టూడెంట్​ ఎస్​.వంశీ మూడో స్థానం సాధించారు. 100 మీటర్ల మెన్​ విభాగంలో మంచిర్యాల శ్రీవికాస్​ డిగ్రీ కాలేజీ స్టూడెంట్ పీఎస్​ అభిలాష్​ ఫస్ట్ ప్లేస్​ లో నిలవగా.. మరిపెడ టీఎస్​డబ్ల్యూఆర్​డీ కాలేజీకి చెందిన విద్యార్థులు బి.రాము, బి.అనిల్​ తర్వాత స్థానాల్లో నిలిచారు. మహిళల 100 మీటర్ల విభాగంలో ఖమ్మం సోషల్​ వెల్ఫేర్ రెసిడెన్సియల్​ డిగ్రీ కాలేజీకి చెందిన వి.సంధ్య ప్రథమ స్థానంలో నిలవగా.. ఆదిలాబాద్​ ఆర్ట్స్​ కాలేజీ స్టూడెంట్​ కె.జంగాబాయి, ఖమ్మం టీఎస్​ డబ్ల్యూఆర్​డీసీకి చెందిన టి.శ్రీవిద్య రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గురువారం వివిధ విభాగాల్లో ఫైనల్ పోటీలు జరగనున్నాయి. క్యాంపస్​ కాలేజీ ప్రిన్సిపాల్​ ప్రొ.బి.సురేశ్​ లాల్​, స్పోర్ట్స్​ బోర్డ్​ సెక్రెటరీ సవితా జ్యోత్స్న, ప్రొ.వి.రమేశ్​ రెడ్డి, జి.సునీల్ రెడ్డి, ఎస్​.కుమారస్వామి  పాల్గొన్నారు.