
జనగామ జిల్లా కేంద్రంలో మందు బాబు హల్ చల్ సృష్టించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు ఫుల్ గా మద్యం తాగిన పట్టుబడ్డాడు. అటుగా వస్తున్న అతని బండిని ఆపడానికి చూసిన పోలీసుల పై ఆగ్రహం గురయ్యాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు సదరు వ్యక్తి.
తన వాహనాన్ని కింద పడేసి తగలబెడతానంటూ ఫైర్ అయ్యాడు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకుండా హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ జీపులో స్టేషన్ కు తరలించారు.