ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి సర్ప్రైజ్ వీడియో వచ్చేసింది

ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి సర్ప్రైజ్ వీడియో వచ్చేసింది

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్(Kajal agarwal), శ్రీలీల(Sreeleela) కీ  రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్,సాంగ్, పోస్టర్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. 

లేటెస్ట్గా డైరెక్టర్ అనిల్ రావిపూడి.. భగవంత్ కేసరి నుంచి అదిరిపోయే సర్ప్రైజ్​ ఇచ్చారు. సినిమా షూటింగ్​పూర్తైనట్లు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసాడు. ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి పేరుతో..షూటింగ్​ సెట్లోని మేకింగ్ ​వీడియోను పంచుకున్నారు డైరెక్టర్. డిసెంబర్ 8, 2022న షూట్ జర్నీని స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. అందుకు 8 నెలలు..24 అద్భుత లొకేషన్స్​..12 భారీ సెట్స్లో ఈ మూవీని చిత్రీకరించినట్లు వీడియోలో పేర్కోన్నారు.

ఈ వీడియోలో..డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ కొట్టి..షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముగిసేవరకు సెట్లో జరిగిన విషయాలను వీడియోలో చూపించారు. కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, బాలయ్యపై చిత్రీకరించిన సన్నివేశాలు, యాక్షన్​ సన్నివేశాలు భారీగా ఉన్నట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ వీడియోతో భగవంత్ కేసరి సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చేశారు డైరెక్టర్. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫస్ట్ ఊరమాస్ ఫిల్మ్ బాలయ్యతో కావడం విశేషం.  

భగవంత్ కేసరి సినిమాని షైన్ స్క్రీన్(Shine screen) పతాకంపై సాహు గరికపాటి(Sahu garikapati) నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా..లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించనుంది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.