కిడ్నాప్ బాలుడి కథ సుఖాంతం

కిడ్నాప్ బాలుడి కథ సుఖాంతం

ఇమ్లీబన్ బస్ స్టేషన్ లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా ఉన్నాడు.  మిర్యాలగూడలో బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. వారం క్రితం ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళ  హైదరాబాద్ కు బాలుడితో వచ్చింది. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో 44 ప్లాట్ ఫామ్ నెంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. బాలుడిని తీసుకెళ్లే విజువల్స్ బస్ స్టాండ్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు కిడ్నాపర్, బాలుడి ఫొటోలు పంపారు. అయితే మిర్యాలగూడలోని ఒక బస్సులో  బాలుడు ఉండగా గుర్తించిన ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తే బస్సు ఎక్కించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. బాలుడు మిస్సింగ్ కేసు ను కిడ్నాప్ గా నే దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

మరిన్నివార్తల కోసం

తుఫాన్ ధాటికి కొట్టుకొచ్చిన ర‌థం.. ఏ దేశానిది..?

నేపాల్ బౌలర్ ‘పుష్ప’ సెలబ్రేషన్స్.. ఐసీసీ రియాక్షన్