నిజామాబాద్లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

నిజామాబాద్లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

నిజామాబాద్ లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కిడ్నాపర్ల నుంచి అబ్బన్న అనే వ్యాపారి తప్పించుకున్నాడు. ఫైనాన్స్ డబ్బులు రూ.5 లక్షల విషయంలో కొంతకాలంగా కాలురుకు చెందిన కొందరితో గొడవ జరుగుతున్నట్లు బాధితుడు చెప్పాడు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులో జరిగిన లావాదేవీల కారణంగా గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఆటోలో మాట్లాడుకుందామని చెప్పి.. తమ వెంట తీసుకెళ్లి తీవ్రంగా చితకబాది.. కెనాల్ లో పడేశారు కిడ్నాపర్లు.

అతి కష్టం మీద తప్పించుకుని.. దుబ్బ ప్రాంతంలో సొమ్మ సిల్లి పడిపోయాడు అబ్బన్న. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే108కి సమాచారం అందించారు. అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.