బకాయిలు చెల్లించాలని మోకాళ్లపై నిలబడి నిరసన : కొత్తగూడెం

బకాయిలు చెల్లించాలని మోకాళ్లపై నిలబడి నిరసన : కొత్తగూడెం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్​లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించాలని, పెంచిన వేతనం ఇవ్వాలని డిమాండ్​చేశారు. సీఎం కేసీఆర్ జీతం పెంచుతున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి అమలుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించనున్నట్టు వెల్లడించారు. యూనియన్​జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, నాయకులు యూసుఫ్, ప్రభావతి, మంగ, లక్ష్మి, క్రాంతి, వెంకటమ్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.