
విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. దీంతో ఎప్పుడెప్పుడు ‘లైగర్’ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆగస్టులో సినిమా రాబోతోంది. ఇప్పటికే టీజర్‌తో అంచనాలు పెంచిన టీమ్... ఈనెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నారు. ‘లైగర్’ హంట్ బిగిన్స్ అంటూ థీమ్ సాంగ్ లిరికల్ వీడియోను రేపు విడుదల చేయబోతున్నారు. విజయ్ పోషిస్తున్న లైగర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంద నేది ఈ పాటలో చూపించబోతున్నారు. విజయ్‌కు జంటగా అనన్య పాండే నటిస్తోంది. మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి నటిస్తున్న విజయ్... మరోవైపు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లోనే ‘జనగణమన’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. మొత్తానికి రెండేళ్ల గ్యాప్‌ను భర్తీ చేసేలా వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ‘లైగర్’తో పాటు ఈ రెండు సినిమాల నుంచి కూడా విజయ్ బర్త్‌డే సందర్భంగా ప్రమోషనల్ కంటెంట్స్ రాబోతున్నాయి.