ప్రజల స్వేచ్ఛ, ఎంపికలను విస్తృతపరచడమే ముఖ్య లక్ష్యం

ప్రజల స్వేచ్ఛ, ఎంపికలను విస్తృతపరచడమే ముఖ్య లక్ష్యం

ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్​ నేషన్​ డెవలప్ మెంట్​ ప్రోగ్రామ్​ 1990 నుంచి మానవాభివృద్ధి సూచీ(హెచ్​డీఐ)ను రూపొందించి ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ది స్థాయిలను తెలిపే నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నది. దేశానికి నిజమైన సంపద ఆ దేశంలోని ప్రజలే. ప్రజల స్వేచ్ఛ, ఎంపికలను విస్తృతపరచడమే ఆర్థికాభివృద్ధి ముఖ్య లక్ష్యం. ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతోపాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమం మానవాభివృద్ధి అని మహబూబ్​ ఉల్​ హక్​ నిర్వచించారు. 1990లో మానవ అభవృద్ధి సూచీని రూపొందించారు. ఈ ఇండెక్స్​ రూపకల్పనలో మహబూబ్​ ఉల్​ హక్, రిచర్జ్​ జాలీ, గుస్తావ్​ రానీష్​, మేఘనాథ్​ దేశాయ్, సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్యసేన్​ల కృషి ఎంతో ఉంది. అయినా హెచ్​డీఐ రూపశిల్పిగా మహబూబ్​ ఉల్​ హక్​ని పేర్కొంటారు. 

హెచ్​డీఆర్​ -2021 

2021 హ్యుమన్​ డెవలప్​మెంట్​ రిపోర్ట్​ను 2022 సెప్టెంబర్​లో ప్రకటించారు. 191 దేశాలకు హెచ్​డీఐని ప్రకటించారు. దీనిని ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా విభజించారు. 

1. Very High Human developed countries     (0.800 నుంచి 1.000)     1–66 దేశాలు 
2. High Human development countries     (0.703 నుంచి 0.796)    67–- 115 దేశాలు 
3. Medium  Human development countries        (0.550 నుంచి 0.699)      116– 159 దేశాలు 
4. Low Human development countries                 (0.00 నుంచి 0.549)    160 – 191 దేశాలు 

  •     బ్రిక్స్​ దేశాల్లో తక్కువ హెచ్​డీఐ కలిగిన దేశం: భారత్​
  •     తొలి 10 స్థానాల్లో ఉన్న దేశాల్లో ఆసియా ఖండ దేశం హాంగ్​కాంగ్​
  •     శ్రీలంక, చైనా, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్​ మన దేశం కంటే మానవాభివృద్ధిలో ముందున్నాయి. 
  •     భారత్​ మానవాభివృద్ధిలో మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాల స్థాయిలో ఉంది. 

బ్రిక్స్​ దేశాలు 

52 – రష్యా : (0.822) 
87 – బ్రెజిల్​: (0.754)
79 – చైనా: (0.768)
109– సౌత్​ ఆఫ్రికా: (0.713) 
132 – ఇండియా:  (0.633) 
ర్యాంకు     దేశం    హెచ్​డీఐ విలువ
1    స్విట్జర్లాండ్​    (0.962)   
2     నార్వే    (0.961)
3    ఐస్​లాండ్​    (0.959)
4    హంగ్​కాంగ్    (0.952)
5    ఆస్ట్రేలియా    (0.951)
6    డెన్మార్క్​    (0.948)
6    స్వీడన్    (0.948)
8    ఐర్లాండ్    (0.945)
9    జర్మనీ    (0.942)
10    నెదర్లాండ్స్​    (0.941) 
చివరి ఐదు దేశాలు
191      దక్షిణ సూడాన్    (0.385)​ 
190      చాద్​    (0.394)
189        నైగర్    (0.400)​
188     సెంట్రల్​ ఆఫ్రికన్​ రిపబ్లిక్    (0.404)​
187    మాలి    (0.428) 
భారత్​  పొరుగు దేశాలు 
73    శ్రీలంక    (0.782)
79     చైనా    (0.768)
90    మాల్దీవులు    (0.747)
127    భూటాన్​    (0.666)
129     బంగ్లాదేశ్    (0.661)
143     నేపాల్​    (0.602)
149    మయన్మార్    (0.586)​
161    పాకిస్తాన్​     (0.544)
180    ఆప్గనిస్తాన్    (0.478)​