వరుణ్ తేజ్ మూవీకి టికెట్ రేట్ల తగ్గింపు

వరుణ్ తేజ్ మూవీకి టికెట్ రేట్ల తగ్గింపు

హైదరాబాద్: కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. టికెట్ రేట్స్ తగ్గించడం ఒక సమస్య అయితే..  థియేటర్లలో షోలు తగ్గించడం మరో సమస్యగా మారింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు వెసులుబాటు ఇవ్వడంతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. పెరిగిన రేట్లు, సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ ప్రతి ఏరియాలోనూ రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. దీన్ని పక్కనబెడితే.. ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో వరుణ్ తేజ్ ‘గని’కి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించారు.

తెలంగాణలో ‘గని’ టికెట్ రేట్స్ తగ్గించాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో రూ.200+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి రూ.150 గా టికెట్ ధరల్ని నిర్ణయించారు. రేట్లు తగ్గించినందున థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దు నిర్మించారు. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని వార్తల కోసం:

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?

త్రివిక్రమ్ శ్రీనివాస్కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్ 

ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా