చనిపోవడానికి ముందు షేన్‌‌ వార్న్‌‌ ఏం చేశాడో చెప్పిన మేనేజర్

చనిపోవడానికి ముందు షేన్‌‌ వార్న్‌‌ ఏం చేశాడో చెప్పిన మేనేజర్
  • వార్న్‌‌ మేనేజర్‌‌ వెల్లడి

కో సమూయ్‌‌ (థాయ్‌‌లాండ్‌‌):   మరణించడానికి ముందు షేన్‌‌ వార్న్‌‌ ఆస్ట్రేలియా–పాకిస్తాన్‌‌ మ్యాచ్‌‌ చూశాడని,  మద్యం కూడా తీసుకోలేదని అతని మేనేజర్‌‌ వెల్లడించాడు.  హాలిడే కోసం థాయ్‌‌లాండ్‌‌ వెళ్లిన వార్న్‌‌.. బరువు తగ్గేందుకు డైటింగ్‌‌ చేస్తున్నాడని తెలిపాడు. మరోవైపు  గుండె పోటుకు గురైన వార్న్‌‌ను బ్రతికించేందుకు అతని దోస్తులుచాలా ప్రయత్నాలు చేశారని థాయ్‌‌లాండ్‌‌ పోలీసులు వెల్లడించారు. అయితే అవి వృథా అయ్యాయని చెప్పారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే వార్న్‌‌ మరణించాడని థాయ్‌‌ ఇంటర్నేషనల్‌‌ హాస్పిటల్‌‌ డైరెక్టర్‌‌ దుల్యకిత్ విట్టయాచన్యపోంగ్ వెల్లడించారు. ‘హోటల్‌‌ నుంచి మాకు సాయంత్రం 4.40కి ఫోన్​ వచ్చింది. పేషెంట్‌‌కు అక్కడే చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ మెడికల్‌‌ టీమ్‌‌ను పంపించాం. అప్పటికే అక్కడ ఉన్న వాళ్లు 20 నిమిషాల పాటు వార్న్‌‌కు సీపీఆర్‌‌ చేశారు. మేం కూడా మరో 45 నిమిషాలు ప్రయత్నించాం. అయినా లాభం లేకపోయింది’ అని దుల్యకిత్‌‌ పేర్కొన్నారు.