కానిస్టేబుల్​ చెంప చెళ్లుమనిపించిండు

కానిస్టేబుల్​ చెంప చెళ్లుమనిపించిండు
  • బెడిసికొట్టిన పోలీసుల మాక్​డ్రిల్

ముంబై: పోలీసులు చేసిన మాక్ డ్రిల్ బెడిసికొట్టింది. టెర్రరిస్టుల్లాగా చేతిలో ఏకే 47 గన్​పట్టుకుని ఓ గుడిలోకి ఎంటర్ అయ్యారు. దీంతో అక్కడున్న ప్రజలంతా గందరగోళానికి గురయ్యారు. అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఒకాయన కోపంగా అరుస్తూ వచ్చి గన్ పట్టుకున్న ఆ కానిస్టేబుల్ చెంపమీద కొట్టాడు. గుడిలో గన్ తో ఏంపనంటూ అరవడం ప్రారంభించాడు. అక్కడున్న ఇతర అధికారులు వచ్చి అతనిని పక్క కు తీసుకెళ్లారు. 

టెర్రరిస్టులు అటాక్ చేస్తే పరిస్థితి ఎట్లుంటది, జనం ఎలా బిహేవ్ చేయాలనే దానిపై పోలీసులు చేస్తున్న మాక్ డ్రిల్ ఇది అని వారు వివరించేసరికి అంతా కూల్ అయ్యారు. ఈ ఘటనతో తన కూతురు భయపడిందని, అందుకే కొట్టానని ఆ యువకుడు చెప్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని స్వామినారాయణ టెంపుల్​లో ఈ నెల6 ఈ ఘటన జరిగింది. జనాలను పరేషాన్ చేసేలా ఇలాంటి మాక్ డ్రిల్స్ ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.