5జీ తో రోజువారి జీవితం మారుతుంది

5జీ తో రోజువారి జీవితం మారుతుంది

వరుణ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.  ఫ్లైట్‌‌‌‌లో మూడు గంటలు ఖాళీగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపు టేకాఫ్ అనౌన్స్‌‌‌‌మెంట్ వచ్చింది. లాస్ట్ మినిట్‌‌‌‌లో వరుణ్‌‌‌‌కు ఏదైనా సినిమా డౌన్‌‌‌‌లోడ్ చేద్దామన్న ఐడియా వచ్చింది. అంతే రెండు అడుగులు వేసేలోపే సినిమా డౌన్‌‌‌‌లోడ్ అయిపోయింది. ఎందుకంటే వరుణ్ చేతిలో ఉంది 5జీ కాబట్టి. నిజమే మరి! అరచేతిలో 5జీ ఉంటే ఎన్నో మ్యాజిక్స్ చేయొచ్చు. ‘మెటావర్స్’ అని ‘వర్చువల్ రియాలిటీ’ అని ఇలా లేటెస్ట్ టెక్నాలజీ గురించి చాలానే విన్నాం. అయితే ఇప్పుడు వాటిని ఎక్స్‌‌‌‌పీరియెన్స్ చేసే రోజులొచ్చేశాయి. టెక్ లవర్స్‌‌‌‌ను ఎంతగానో ఊరిస్తున్న 5జీ ఇప్పుడు రానే వచ్చింది.  ప్రపంచాన్ని మార్చేసే టెక్నాలజీగా చెప్తున్న ఈ 5జీ.. రియల్ వరల్డ్‌‌‌‌లో ఎలా ఉండబోతోంది? 4జీతో పోల్చితే 5జీతో వచ్చే మార్పులేంటి? 5జీ తో రోజువారి జీవితం ఎలా మారుతుంది? ఈ విషయాలపైనే ఈ వారం కవర్ స్టోరీ.

మొబైల్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో సరికొత్త జనరేషన్ ఇప్పుడు మన ముంగిట్లోకి వచ్చింది. మునుపెన్నడూ చూడని స్పీడ్, ఫీచర్లతో 4జీను తలదన్నేలా ఈ 5జీ ఉంటుంది. ఇప్పటికే దేశంలోని కొన్ని సిటీల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌, వొడాఫోన్ ఐడియా సంస్థలు 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను అఫీషియల్‌‌‌‌గా లాంచ్  చేశాయి. చాలామంది మొబైల్స్‌‌‌‌లో 5జీ సింబల్ కనిపిస్తోంది. మరో సంవత్సరంలోగా దేశమంతటా 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ అందుబాటులోకి వస్తుంది.

5జీ అంటే..

5జీ అంటే ‘ఫిఫ్త్​ జనరేషన్’ అని అర్థం. ప్రపంచంలో వైర్‌‌‌‌‌‌‌‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పటివరకూ ఐదుసార్లు అప్‌‌‌‌డేట్ అయింది. ఫస్ట్ జనరేషన్(1జీ) నుంచి ప్రతీ పదేండ్లకు జనరేషన్ మారుతూ వస్తోంది. 5జీ అంటే ఇప్పుడు మనం ఐదవ జనరేషన్ టెక్నాలజీని వాడుతున్నామని అర్థం. మొదటితరం వైర్‌‌‌‌‌‌‌‌లెస్ నెట్‌‌‌‌వర్క్ (1జీ) 1979లో జపాన్‌‌‌‌లో మొదలైంది.  అప్పట్లో 1జీ స్పీడ్ సెకనుకి 2.4 కిలోబైట్స్ మాత్రమే. 1జీ తో కేవలం ఫోన్ ద్వారా  మాట్లాడుకోవడానికి మాత్రమే వీలుండేది. ఆ తర్వాత 1991లో ‘2జీ’ వచ్చింది. ఇది డిజిటల్ సిగ్నలింగ్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని ‘జీఎస్ఎమ్(గ్లోబల్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఫర్‌‌‌‌ మొబైల్‌‌‌‌ కమ్యూనికేషన్స్‌‌‌‌)’అనేవాళ్లు. ఇది 1జీ కంటే కాస్త వేగంగా పనిచేస్తుంది. దీని స్పీడ్ సెకనుకి 64 కిలోబైట్స్. మాటలతో పాటు ఎస్సెమ్మెస్‌‌‌‌లు పంపుకోవడం ఈ జనరేషన్‌‌‌‌తోనే మొదలైంది.

ఇక 2001లో మొదలైన ‘3జీ’తో మాటలకు వీడియోలు కూడా తోడయ్యాయి. మొబైల్‌‌‌‌ఫోన్ల ద్వారా వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లు, స్ట్రీమింగ్‌‌‌‌ లాంటివి దీంతోనే అందుబాటులోకి వచ్చాయి. 3జీ స్పీడ్ సెకనుకు 3 నుంచి 8 మెగాబైట్లు. ఇక ఆ తర్వాత 2009లో ‘4జీ’తో స్మార్ట్‌‌‌‌ఫోన్ల శకం మొదలైంది. దీన్ని ‘లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ ఎవల్యూషన్‌‌‌‌ (ఎల్‌‌‌‌టీఈ)’ అంటారు.  సోషల్‌‌‌‌మీడియా, హెచ్‌‌‌‌డీ స్ట్రీమింగ్‌‌‌‌, యాప్స్ లాంటివి ఈ జనరేషన్‌‌‌‌లోనే మొదలయ్యాయి. 4జీ స్పీడ్ సెకనుకు 100 మెగాబైట్ల నుంచి ఒక గిగాబైట్ వరకూ ఉంటుంది.  ఇక ఇప్పుడు వచ్చింది 5జీ. ఇది అన్నింటికంటే వేగంగా పనిచేస్తుంది. డేటా ట్రాన్స్‌‌‌‌ఫర్, అప్‌‌‌‌లోడ్‌‌‌‌, డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ స్పీడ్  4జీ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. 5జీ స్పీడ్ సెకనుకి 10 నుంచి 20 గిగాబైట్లు ఉంటుందని అంచనా.

2జీ, 3జీల టైంలో సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ కేవలం సమాచారాన్ని మాత్రమే చేరవేసేది. 4జీతో ఇంటర్నెట్ స్పీడ్  పెరగడం, డిజిటలైజేషన్ లాంటివి సాధ్యమయ్యాయి. ఇప్పుడు వచ్చిన 5జీ టెక్నాలజీలో ఊహించలేని ఎన్నో అద్భుతాలు సాధించొచ్చని టెక్ ఎక్స్‌‌‌‌పర్ట్స్ అంటున్నారు. 5జీతో స్మార్ట్‌‌‌‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లతోపాటు ఇంటర్నెట్‌‌‌‌, క్లౌడ్ ఆధారంగా పనిచేసే డివైజ్‌‌‌‌లన్నీ హైస్పీడ్ డేటాతో పనిచేస్తాయి. 3జీబీ సైజు ఉండే సినిమా రెండు సెకన్లలో డౌన్‌‌‌‌లోడ్ అవుతుంది.  మెటావర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగాల్లో 5జీ కొత్త మార్పులు తీసుకురానుంది. 5జీని ‘న్యూ రేడియో’, ‘క్వాంటమ్ లీప్’ అని పిలుస్తున్నారు.

4జీ వర్సెస్ 5జీ 

5జీ టెక్నాలజీ ప్రస్తుతం ఉన్న 4జీ ‘ఎల్‌‌‌‌టీఈ’ కంటే పూర్తిగా వేరు. 4జీ కేవలం ఒకేరకమైన రేడియో వేవ్స్‌‌‌‌తో పనిచేస్తే.. 5జీ  మూడు రకాల రేడియో వేవ్స్‌‌‌‌తో పనిచేయగలదు. దీనివల్ల మొబైల్ నెట్‌‌‌‌వర్క్ సిగ్నల్స్ పెరుగుతాయి.  ఈ సిగ్నల్స్ గోడల నుంచి కూడా సులువుగా ప్రయాణం చేయగలవు. 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ‘లాటెన్సీ’ చాలా తక్కువ. లాటెన్సీ అంటే మొబైల్‌‌‌‌ఫోన్‌‌‌‌ నుంచి సెల్‌‌‌‌ టవర్‌‌‌‌కు సిగ్నల్స్ చేరేందుకు పట్టే టైమ్​. 4జీ లాటెన్సీ 98 మిల్లీసెకన్లయితే 5జీలో అది మిల్లీ సెకను కంటే తక్కువ. అంటే కాల్ బటన్‌‌‌‌ నొక్కిన వెంటనే కనెక్ట్ అయిపోతుందన్న మాట. అలాగే 4జీ నెట్‌‌‌వర్క్‌‌‌‌లో ఒక్కో మొబైల్‌‌‌‌ టవర్‌‌‌‌ ద్వారా 200 నుంచి 400 మందికి సర్వీస్ అందితే 5జీ టవర్ ద్వారా వంద రెట్లు ఎక్కువ మంది సులువుగా సర్వీస్‌‌‌‌ను అందుకోగలరు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా 4జీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.  సెకనుకు పది గిగాబైట్ల స్పీడ్ ఇవ్వగల హైబ్యాండ్‌‌‌‌ స్పెక్ట్రమ్‌‌‌‌ తరంగాలను ఈ కొత్త 5జీ టెక్నాలజీలో వాడతారు.

డైలీ లైఫ్ ఇలా..

‘మీరు కాల్‌‌‌‌ చేస్తున్న వ్యక్తి నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ పరిధిలో లేడు’ అనే మాట ఇకపై వినిపించకపోవచ్చు. ఎందుకంటే 5జీ టవర్ల ద్వారా తక్కువ యాంటెన్నాలతో ఎక్కువమందికి కనెక్షన్లు ఇవ్వొచ్చు. ఇదొక్కటే కాదు 5జీ అందుబాటులోకి వస్తే రోజువారీ జీవితంలో చాలా మార్పులొస్తాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మీటింగ్స్ జరిగేటప్పుడు అవతలి వాళ్ల మాటలు కట్ అవ్వడం, నెట్‌‌‌‌వర్క్ లేక యూట్యూబ్ వీడియోలు బఫర్ అవ్వడం,  క్యాబ్ బుక్‌‌‌‌ చేస్తే కనెక్ట్ అవ్వకుండా విసిగించడం, సినిమాలు డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయడానికి గంటల టైం పట్టడం, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సర్వర్‌‌‌‌ డౌన్‌‌‌‌ అవ్వడం, షాపుల్లో గూగుల్‌‌‌‌పే, ఫోన్‌‌‌‌పే చేసేటప్పుడు అకౌంట్‌‌‌‌లో డబ్బులు కట్ అయ్యి, అవతలి వాళ్లకు పడకుండా ట్రాన్సాక్షన్‌‌‌‌ మధ్యలో ఆగిపోవడం.. ఇలా రోజువారీ నెట్‌‌‌‌వర్క్ ఇబ్బందులన్నింటికీ 5జీ తో చెక్ పడుతుంది.  ఇకపై క్రికెట్ మ్యాచ్‌‌‌‌లు టీవీలోనే కాదు, వర్చువల్‌‌‌‌గా స్టేడియంలో ఉండి చూడొచ్చు. వీఆర్ హెడ్‌‌‌‌సెట్ పెట్టుకుని గ్రౌండ్‌‌‌‌లో ఉండి మ్యాచ్ చూస్తున్న అనుభూతి పొందొచ్చు. వీడియో గేమ్స్ ఆడేవాళ్లు హైఎండ్ గ్రాఫిక్స్‌‌‌‌తో వర్చువల్ గేమ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను పొందొచ్చు. మొబైల్‌‌‌‌లో ఈజీగా 4కె, 8కె వీడియోలు డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు. 

చాలామంది ఇళ్లల్లో ఉండే పెద్దపెద్ద టీవీల క్వాలిటీ 5జీతో మరింత పెరుగుతుంది. ఇప్పటివరకూ మాటల్లో ఉన్న స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్‌‌‌‌ను 5జీతో నిజం చేయొచ్చు. ఇంట్లోని గాడ్జెట్స్ అన్నింటినీ మొబైల్‌‌‌‌కు కనెక్ట్ చేసి ఒక్క క్లిక్ లేదా వాయిస్ కమాండ్‌‌‌‌తో  వాటితో పని చేయించుకోవచ్చు. 5జీతో ఇంటర్నెట్ ఒక్కటే కాదు రకరకాల వైర్‌‌‌‌‌‌‌‌లెస్ కనెక్షన్లు అన్నీ స్పీడ్‌‌‌‌గా కనెక్ట్ అవుతాయి. 5జీ తో వచ్చే పెద్ద మార్పు ఏంటంటే దీని బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ. అంటే ఇది తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని మోసుకెళ్లగలదు. అందుకే 5జీతో నిజమైన వైర్‌‌‌‌‌‌‌‌లెస్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ పొందొచ్చు.

ఎన్నో మార్పులు

హై స్పీడ్ ఇంటర్నెట్‌‌‌‌, సినిమాల డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ కోసమేనా 5జీ అంటే  కాదనే చెప్పాలి. 5జీ అంటే స్పీడ్ ఒక్కటే కాదు. సేఫ్టీ, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇలా టెక్నాలజీలో సరికొత్త మార్పులు 5జీతో సాధ్యమవుతాయి. మనిషి అనుభూతులన్నీ ఒక కొత్త స్థాయికి చేర్చగల టెక్నాలజీ ఇది. ఇంటి నుంచి ఆఫీసు వరకూ, హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ నుంచి వ్యవసాయం వరకూ దాదాపుగా అన్ని రంగాలను ఇది ప్రభావితం చేయగలదు.  మెషిన్లు వాటికవే ఆలోచించి నిర్ణయం తీసుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌’, వేర్వేరు మెషిన్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ పనిచేసే ‘ఇంటర్నెట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ థింగ్స్‌‌‌‌’, ‘వర్చువల్‌‌‌‌ రియాలిటీ’, ‘ఆగ్మెంటెడ్‌‌‌‌ రియాలిటీ’ లాంటివన్నీ నిజ జీవితంలోకి వచ్చేందుకు 5జీ ఒక మార్గం. 5జీతో ఇంకా ఏమేం చేయొచ్చు అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 5జీతో ఏయే రంగాల్లో ఎలాంటి మార్పులకు అవకాశం ఉందంటే..

మెటావర్స్:  ‘మెటావర్స్’ అన్న పదం వినడమే గానీ అదెలా పనిచేస్తుందో చాలామందికి తెలియదు. ఇకపై మెటావర్స్‌‌‌‌ను రియల్ టైంలో ఎక్స్‌‌‌‌పీరియెన్స్  చేయొచ్చు. వర్చువల్‌‌‌‌గా షాపింగ్‌‌‌‌ చేయడం, ఇతర దేశాల్లో జరిగే వేడుకల్లో వర్చువల్‌‌‌‌గా పాల్గొనడం, ఇంట్లోనే ఉండి గంగా హారతిని వర్చువల్‌‌‌‌గా అనుభూతి చెందడం లాంటివి ఇకపై కామన్ అయిపోతాయి. వర్చువల్ వరల్డ్ అంటే కృత్రిమంగా క్రియేట్ చేసిన ఊహా ప్రపంచం. అంటే వీడియోల్లా కాకుండా అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుందన్న మాట.

మెడికల్ సర్వీసులు: 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌తో హాస్పిటళ్లు, ట్రీట్మెంట్ పద్ధతులు కూడా పూర్తిగా మారిపోతాయి. స్మార్ట్‌‌‌‌ ట్రీట్​మెంట, టెలిమెడిసిన్‌‌‌‌, స్మార్ట్ అంబులెన్స్‌‌‌‌లు అందరికీ అందుబాటులోకి వస్తాయి. పేషెంట్లు ఇంట్లోనే ఉండి వర్చువల్‌‌‌‌గా డాక్టర్‌‌‌‌తో మాట్లాడొచ్చు. అత్యవసరమైతే తప్ప హాస్పిటల్‌‌‌‌కి వెళ్లాల్సిన పనిలేదు. రకరకాల ప్లాట్‌‌‌‌ఫామ్స్ ద్వారా పేషెంట్ల మెడికల్ హిస్టరీ క్షణాల్లో హాస్పిటల్‌‌‌‌కు చేరుతుంది. అంబులెన్స్‌‌‌‌ సర్వీసులు కూడా అప్‌‌‌‌డేట్ అవుతాయి. రియల్ టైం డేటా ట్రాన్స్‌‌‌‌ఫర్ సర్వీసుల ద్వారా అంబులెన్స్‌‌‌‌లోనే మెరుగైన ట్రీట్మెంట్ అందే అవకాశం ఉంది. రోబోటిక్‌‌‌‌ హ్యాండ్స్‌‌‌‌ సాయంతో డాక్టర్లు ఎక్కడో ఉన్న పేషెంట్‌‌‌‌కి రిమోట్‌‌‌‌ సర్జరీలు చేయగలుగుతారు. 

అగ్రికల్చర్: 5జీతో వ్యవసాయాన్ని కూడా డిజిటలైజ్ చేయొచ్చు. సెన్సర్లను ఉపయోగించి రియల్ టైంలో నీటి పారుదల, చీడ పురుగులు, పంట కోతలు లాంటి వాటిని కంట్రోల్ చేయొచ్చు. వ్యవసాయంలో రోబోటిక్స్ వాడకాన్ని పెంచొచ్చు. మనుషుల అవసరం లేకుండా డ్రోన్లు, సెన్సర్లు, కెమెరాలు, ఏఐ రోబో మెషిన్లు కలిసి వ్యవసాయం చేస్తాయి. ఏ పురుగుల మందు ఎప్పుడు వాడాలి? పంటకు  నీరెప్పుడు అందించాలి? కలుపుతీసే టైం వచ్చిందా? అనే విషయాలు ఏఐ సిస్టమ్స్ చూసుకుంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలు తీసుకుంటాయి.

డ్రోన్ టెక్నాలజీ: 5జీ లో ఉండే హైస్పీడ్ డేటా ట్రాన్స్‌‌‌‌ఫర్ వల్ల  డ్రోన్‌‌‌‌లను కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది.  వ్యవసాయం, మెడికల్ రంగాల్లో డ్రోన్ల వాడకం పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్స్ మెడిసిన్లు అందిస్తాయి. పరిశ్రమలు: ఫ్యాక్టరీలు నడిపేందుకు కూడా 5జీని వాడుకోవచ్చు. దీనివల్ల పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫ్యాక్టరీలన్నీ ఆటోమెటిక్‌‌‌‌గా పనిచేస్తాయి. సెన్సర్లు, రోబోల ద్వారా మొత్తం ఫ్యాక్టరీ పనులను చక్కబెట్టొచ్చు. పనిచేయాల్సిన ప్రాంతాన్ని కచ్చితంగా మ్యాప్‌‌‌‌ చేయడం, వేగంగా, సురక్షితంగా ఏ వస్తువునైనా అసెంబుల్‌‌‌‌ చేయడం 5జీ తో ఈజీ అవుతుంది.

ట్రాన్స్‌‌‌‌పోర్ట్: 5జీతో రోజువారీ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కూడా మారుతుంది.  రోడ్లపై ఎలక్ట్రిక్ వెహికిల్స్ పెరుగుతాయి. ఛార్జింగ్‌‌‌‌ స్టేషన్లను వాహనాలకు లింక్ చేయొచ్చు. దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌ను ఈజీగా కనిపెట్టొచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు పెరుగుతాయి. బండ్లలోని సెన్సర్లు, కెమెరాలు, మైక్రోప్రాసెసర్లు దగ్గర్లోని ఇతర వాహనాలతో కమ్యూనికేట్ చేయగలుగుతాయి. అలా రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించొచ్చు.

ఇవి కూడా..

5జీ టెక్నాలజీతో స్టూడెంట్స్ ఒకేసారి వేర్వేరు కోర్సులు చదువుకోవచ్చు. టీచర్లు ఎక్కడో ఉండి వర్చువల్‌‌‌‌గా క్లాసులు చెప్పొచ్చు. ఇంటరాక్టివ్‌‌‌‌ వర్చువల్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ కోర్సులు వస్తాయి.  సబ్జెక్ట్‌‌‌‌ను మరింత క్లియర్​గా నేర్చుకోవచ్చు. 5జీ తో ట్రావెలింగ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ కూడా మారుతుంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల్లో రోబోలే స్కాన్‌‌‌‌లు, వెరిఫికేషన్స్ చేస్తాయి. హోటల్స్ అన్నీ స్మార్ట్‌‌‌‌గా మారతాయి. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మారుతుంది. నోట్ల వాడకం, తరచూ బ్యాంక్‌‌‌‌కు వెళ్లాల్సి రావడం పూర్తిగా తగ్గిపోతాయి.
ఆధార్, పాన్ కార్డుల్లాగా  డిజిటల్ ఐడెంటిటీ కార్డులు కూడా రావొచ్చు. దేశ భద్రత, నిఘా వ్యవస్థల్లో కూడా 5జీ ‘కీ’ రోల్  పోషించగలదు. వీడియోలో చూసి మనిషిని గుర్తుపట్టడం కాకుండా ఫేస్‌‌‌‌ రికగ్నిషన్‌‌‌‌ టెక్నాలజీతో నేరస్తులను పక్కాగా పట్టుకునే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలు హెచ్‌‌‌‌డీ క్వాలిటీ వీడియోలను సులువుగా రికార్డ్ చేసి క్లౌడ్‌‌‌‌లో సేవ్ చేయగలవు.

ఒక్కోపనికి ఒక్కో యాప్ వాడకుండా రకరకాల పనులన్నీ ఒకే యాప్‌‌‌‌లో చేసుకునేలా ‘సూపర్ యాప్స్’ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే డేటా స్పీడ్ సరిపోక అవి అందుబాటులోకి రాలేదు. 5జీతో అలాంటి సూపర్ యాప్స్‌‌‌‌కు అవకాశం ఉంది.
నగరాలను స్మార్ట్‌‌‌‌ సిటీలుగా మార్చడం 5జీ తో ఈజీ అవుతుంది. నగరాల్లో కరెంట్, నీటిసరఫరా, వీధిలైట్లు, ట్రాఫిక్‌‌‌‌, డ్రైనేజీ  లాంటివన్నీ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. లాటెన్సీ అతితక్కువగా ఉండటం, డేటా ట్రాన్స్‌‌‌‌ఫర్  స్పీడ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ అల్గారిథమ్‌‌‌‌లు మరింత మెరుగ్గా పనిచేస్తాయి. అంటే ఏఐ డివైజ్‌‌‌‌లు డెసిషన్స్ వేగంగా తీసుకుంటాయి.  దీనివల్ల పెద్దపెద్ద పనులు కూడా పర్ఫెక్ట్​గా, చిటికెలో జరిగిపోతాయి.  

నష్టాలూ ఉన్నాయ్

5జీ రాకతో అన్ని చోట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతుంది. దీంతో వర్కర్ల అవసరం తగ్గుతుంది. కొన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలు తగ్గొచ్చు. 5జీ మొబైల్‌‌‌‌ సర్వీసుల కోసం ఉపయోగించే రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ, విమానాల ఎత్తును కొలిచేందుకు వాడే రేడియో ఆల్టీ మీటర్‌‌‌‌  ఫ్రీక్వెన్సీ దాదాపు ఒకే స్థాయిలో ఉండటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. 5జీ సిగ్నల్స్ కారణంగా విమానాల  బ్రేకింగ్‌‌‌‌ వ్యవస్థ దెబ్బతింటుందట. అయితే ఈ సమస్యలకు సొల్యూషన్ కనుక్కునేందుకు  ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేడియో తరంగాలను ఫిల్టర్‌‌‌‌ చేసే పరికరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సాల్వ్  చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి. ఉన్న వాటిని తొలగించి కొత్త బేస్‌‌‌‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. ఇంటర్నెట్‌‌‌‌తో పనిచేసే డివైజ్‌‌‌‌లన్నీ మొబైల్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లోకి చేరడం వల్ల సెక్యూరిటీ, సేఫ్టీ, ప్రైవసీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లోకి హ్యాకర్లు చొరబడే ప్రమాదం ఉంది. 5జీతో వాతావరణంలో హై ఫ్రీక్వెన్సీ కలిగి ఉండే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ పెరుగుతుంది. దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు జంతువులు, పక్షులు కూడా నష్టపోక తప్పదు. 5జీతో ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌కు కూడా కొంత నష్టం ఉంది. 5జీ రాకతో ఎనర్జీ వాడకం బాగా పెరుగుతుంది. అది క్లైమెట్ ఛేంజ్‌‌‌‌కు దారి తీస్తుంది. 

రేట్లు ఎక్కువా?

డేటా స్పీడ్ పెరగడం వల్ల యూజర్లు 5జీ లో ఎక్కువ డేటా వాడాల్సి ఉంటుంది. కాబట్టి  టెలికాం కంపెనీలు ఆ భారాన్ని యూజర్లపైనే వేస్తాయి. అయితే మొదట్లో అందరినీ 5జీ వైపు ఆకర్షించేందుకు కంపెనీలు టారిఫ్‌‌‌‌ ధరలు అందుబాటులో ఉంచుతాయి. అందరూ అలవాటు పడ్డాక ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 4జీ టారిఫ్ ధరలతోనే 5జీ సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 5జీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక 5జీ ప్లాన్స్ ధరలు మారొచ్చు.  ప్రస్తుతం ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, జియో ప్రిపెయిడ్/ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ రూ. 239 నుంచి మొదలవుతున్నాయి.  రాబోయే రోజుల్లో 4జీతో పోలిస్తే 5జీ ప్లాన్స్ ధరలు 25 శాతం పెరగొచ్చు.

5జీ ఫోన్‌‌‌‌ కొనాలా?

ఫోన్ 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను సపోర్ట్ చేయాలంటే అందులో 5జీ ప్రాసెసర్‌‌‌‌ ఉండాల్సిందే.  మార్కెట్లో ఏడాది ముందునుంచే 5జీ ఫోన్ల సందడి మొదలైంది. మొబైల్‌‌‌‌ కంపెనీలన్నీ వరుసగా 5జీ ఫోన్లను లాంచ్‌‌‌‌ చేస్తున్నాయి. కొత్తగా ఫోన్‌‌‌‌ కొనాలనుకునేవాళ్లకు 5జీ ఫోన్‌‌‌‌ కొనాలా? వద్దా? అనే డౌట్ రావడం కామన్. 4జీ స్మార్ట్‌‌‌‌ఫోన్లతో పోలిస్తే 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్ల ధర కాస్త ఎక్కువ. 5జీ ని ఎక్స్‌‌‌‌పీరియెన్స్ చేయాలి అనుకుంటే మొబైల్‌‌‌‌ మార్చక తప్పదు. అయితే గ్రామాలకు 5జీ రావడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి గ్రామాల్లో ఉండేవాళ్లు అప్పుడే కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం కనిపించడం లేదు. 5జీ ఫోన్‌‌‌‌ కొనాలంటే కనీసం రూ.15వేలు పెట్టాలి. రానున్న రోజుల్లో తక్కువ ధరకే 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

5జీ మొబైల్ కొనేముందు

5జీ మొబైల్ కొనేముందు ఆ ఫోన్‌‌‌‌ అన్ని 5జీ బ్యాండ్లను సపోర్ట్‌‌‌‌ చేస్తుందో లేదో చూసుకోవాలి. 8 నుంచి 12 రకాల బ్యాండ్స్‌‌‌‌ను సపోర్ట్ చేసే ఫోన్ తీసుకోవాలి. రూ. 20 వేల నుంచి రూ. 30వేల బడ్జెట్‌‌‌‌లో ఉండే ఫోన్లు దాదాపు అన్ని బ్యాండ్లను సపోర్ట్‌‌‌‌ చేస్తాయి. ఫోన్‌‌‌‌ కొనేముందు 5జీ ప్రాసెసర్‌‌‌‌ అవునా? కాదా? అనేది కచ్చితంగా చెక్ చేసుకోవాలి. క్వాల్‌‌‌‌కామ్‌‌‌‌ స్నాప్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ 695, 765జీ, 865 ఆపై మోడల్స్‌‌‌‌ అన్నీ 5జీని సపోర్ట్ చేస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్‌‌‌‌లో 700, 8100, 9,000తోపాటు జీ, హీలియో సిరీస్‌‌‌‌ ప్రాసెసర్లు 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను సపోర్ట్ చేస్తాయి. అలాగే 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌కు ఎక్కువ బ్యాటరీ అవసరం అవుతుంది. కాబట్టి  కనీసం 4,500 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ ఉండాలి. కొత్త టెక్నాలజీలో ఉండే లోటుపాట్లను సరిచేస్తూ ఆయా కంపెనీలు అప్‌‌‌‌డేట్‌‌‌‌లను రిలీజ్ చేస్తుంటాయి. అందుకే కొంటున్న ఫోన్‌‌‌‌ కంపెనీ ఓఎస్‌‌‌‌ను తరచుగా అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేస్తుందా? లేదా? అని చెక్‌‌‌‌ చేయాలి. అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ సరిగా రాకుంటే ఆ ఫోన్‌‌‌‌ను కొనకపోవడమే మేలు. ఐఫోన్ విషయానికొస్తే ఐఫోన్ 12 , ఆపైన మోడల్స్ వాడేవాళ్లకు 5జీ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చే ‘ఐఓఎస్ 16.2’ అప్‌‌‌‌డేట్‌‌‌‌తో 5జీ సపోర్ట్ వస్తుంది.  

అందరికీ ఎప్పుడు?

5జీ కి కావాల్సిన ఫైబర్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ లైన్లు దేశమంతటా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కిందటేడాది వరకు దేశంలో కేవలం 30 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఈ ఫైబర్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ లైన్లు పూర్తయితే, మరో 70 శాతం మేరకు పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. టెలికాం సంస్థలన్నీ పూర్తి స్థాయిలో ఫైబర్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ లైన్లు వెయ్యాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అందుకే ప్రస్తుతానికి కొన్ని నగరాల్లో మాత్రమే 5జీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌‌‌‌లో ఇప్పటికే ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ 5జీ పనిచేస్తోంది. రీసెంట్‌‌‌‌గా రిలయన్స్ జియో కూడా ‘ట్రూ5జీ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ సిటీలో జియో 5జీ.. 600 ఎంబీపీఎస్ స్పీడ్‌‌‌‌తో పనిచేస్తుంటే.. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ 5జీ 516 ఎంబీపీఎస్ స్పీడ్‌‌‌‌తో పనిచేస్తోంది.

5జీ ని దేశమంతటా తీసుకురావడం కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, జియోలు నువ్వా? నేనా? అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌ సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో 5జీని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు దేశంలోని వెయ్యి పట్టణాలు, నగరాల్లో 5జీని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జియో  చెప్తోంది. 5జీ స్పీడ్ విషయంలోనూ ఈ రెండు సంస్థలు పోటీపడుతున్నాయి. మరోపక్క వీళ్లిద్దరికీ పోటీ ఇచ్చేందుకు వొడాఫోన్‌‌‌‌ ఐడియా కూడా బలంగా ట్రై చేస్తోంది. ఏదేమైనా మరో ఏడాది అంటే 2023 డిసెంబర్ నాటికి గ్రామాల్లో కూడా 5జీ నెట్‌‌‌‌వర్క్ తీసుకురావడం కోసం ప్రభుత్వం, టెలికం కంపెనీలు పనిచేస్తున్నాయి. ::: తిలక్​

కొత్త ఉద్యోగాలు

5జీ రాకతో 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ‘టెలికాం సెక్టార్‌‌‌‌ స్కిల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌’(టీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ) అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీతో పోలిస్తే 5జీ టెక్నాలజీ వంద రెట్ల వేగంతో పనిచేస్తుంది. కాబట్టి, దాన్ని ఉపయోగించుకోవడం కోసం కొత్త స్కిల్స్ ఉన్న ఉద్యోగులు అవసరమవుతారు. అందుకే ఇప్పటికే పలు సంస్థలు 5జీ టెక్నాలజీతో పాటు  ఇంటర్నెట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ థింగ్స్‌‌‌‌ (ఐఓటీ), ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ (ఏఐ), మెషిన్‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌ (ఎంఎల్‌‌‌‌), క్లౌడ్‌‌‌‌ కంప్యూటింగ్, రోబోటిక్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ ఆటోమేషన్‌‌‌‌ వంటి ఎమర్జింగ్‌‌‌‌ టెక్నాలజీలపై తమ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఈ టెక్నాలజీల గురించి నేర్చుకున్నవాళ్లకు ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో మంచి అవకాశాలు ఉంటాయి.

అసలైన స్పీడ్ ఎప్పుడొస్తుందో..

నేను రీసెంట్‌గానే 5జీ మొబైల్ కొన్నా. జియో సిమ్ వాడుతున్నా. 5జీ ఎంత స్పీడ్ ఉంటుందో చూడాలని అందరిలాగే నేనూ  వెయిట్ చేశా. జియో5జీ అందరికీ ఒకేసారి రాలేదు. కొంతమంది యూజర్లకే ‘వెల్‌కమ్‌టు 5జీ’ అని మెసేజ్ వచ్చింది. నాకు ఆ నోటిఫికేషన్ రాగానే నెట్‌వర్క్ స్పీడ్ టెస్ట్ చేశా. నేనున్న ఏరియా కూకట్‌పల్లి. అక్కడ 5జీ స్పీడ్ 180 ఎంబీపీఎస్ వచ్చింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో ఉన్నప్పుడు 300 ఎంబీపీఎస్ వరకూ స్పీడ్ వచ్చింది. కానీ, కంపెనీలు చెప్తునట్టు 500ఎంబీపీఎస్ స్పీడ్ రాలేదు. అయితే ఇప్పుడు వస్తుంది నిజమైన 5జీ కాదని, 5జీ టవర్లు పెట్టాక ఇంకా స్పీడ్ వస్తుందని చెప్తున్నారు. అసలైన 5జీ  స్పీడ్ ఎప్పుడొస్తుందో చూడాలి. - యశ్వంత్, హైదరాబాద్ 

5జీ సెట్టింగ్స్ ఇలా..

మొబైల్‌‌‌‌లో 5జీ సేవలు పొందాలంటే ముందుగా ఫోన్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్ 5జీ బ్యాండ్‌‌‌‌ను సపోర్టు చేస్తుందా? లేదా? అన్నది చూసుకోవాలి. అలాగే సిమ్‌‌‌‌ 5జీకి సపోర్ట్‌‌‌‌ చేస్తుందో, లేదో తెలుసుకోవాలి. 4జీ సిమ్‌‌‌‌తోనే 5జీ సేవలు కూడా పొందొచ్చని ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌, రిలయన్స్‌‌‌‌ జియో చెప్తున్నాయి. 

- 5జీ కోసం మొబైల్‌‌‌‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి.

- ముందుగా మొబైల్ సెట్టింగ్స్‌‌‌‌లోకి వెళ్లి, ‘మొబైల్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌/నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ మోడ్‌‌‌‌’ సెలక్ట్ చేసి, 5జీ/ 4జీఎల్‌‌‌‌టిఇ/3జీ/2జీ(ఆటో కనెక్ట్‌‌‌‌) దగ్గర ‘5జీ’ సెలక్ట్ చేసుకోవాలి. 

- స్టాక్‌‌‌‌ ఆండ్రాయిడ్‌‌‌‌ ఫోన్స్‌‌‌‌లో ‘నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇంటర్నెట్ సెట్టింగ్స్’ లో  ‘సిమ్స్’ లోకి వెళ్లి  ‘ప్రిఫర్డ్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ టైప్‌‌‌‌’ - దగ్గర ‘5జీ’ సెలక్ట్ చేయాలి. 

- మొబైల్‌‌‌‌లో 5జీ వస్తున్నట్టయితే స్టేటస్ బార్‌‌‌‌‌‌‌‌లో ‘4జీ ఎల్‌‌‌‌టీఈ’ సింబల్‌‌‌‌కు బదులు ‘5జీ’ అని కనిపిస్తుంది. స్పీడ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చెక్‌‌‌‌ చేసుకుంటే 5జీ ఎంత స్పీడ్‌‌‌‌ వస్తుందో తెలుస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్  ప్రాంతాన్ని బట్టి మారుతుంది.

5జీ లెక్కలివి

- 2024 నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 65 శాతం మందికి 5జీ సేవలు అందుతాయని ఎరిక్సన్‌‌‌‌ మొబైల్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ చెప్తోంది. 

- 5జీని అందుబాటులోకి తెచ్చిన మొదటి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సృష్టించింది. 2019లోనే 5జీ సేవలు మొదలుపెట్టింది.

- ప్రస్తుతం మనదేశంలో 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్లు వాడుతున్న వాళ్ల సంఖ్య 10 కోట్లు. 2027 నాటికి 5జీ యూజర్లు 50 కోట్లకు చేరతారని అంచనా.

- రానున్న 15 ఏళ్లలో కేవలం 5జీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు అందే మొత్తం 3 కోట్ల 58 లక్షల 42 వేల కోట్ల రూపాయలు.

- ఇప్పటికి 72 దేశాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. 5జీ వాడుతున్న దేశాల్లో చైనా, అమెరికా ముందువరుసలో ఉన్నాయి.

- ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు రోజులకు ఓ నగరంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

6జీ వస్తే..

మనం ఇంకా 5జీ గురించి మాట్లాడుకుంటుంటే కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే 6జీ ప్రయోగాలు మొదలుపెట్టేశాయి. చైనా, జపాన్ దేశాలు 6జీకి రెడీ అవుతున్నాయి.  అయితే 5జీ లా కాకుండా 6జీ రావడానికి పదేండ్ల కంటే తక్కువ టైం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 6జీ వేగం 5జీ కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది సబ్ మిల్లీమీటర్ వేవ్స్‌‌‌‌తో పనిచేస్తుంది.  అత్యంత భారీ ఫ్రీక్వెన్సీ ఉన్న తరంగాలను ఉపయోగించుకుంటుంది. 6జీతో ఒక సెకనుకు ఒక టెరాబైట్ డేటాను ట్రాన్స్‌‌‌‌ఫర్ చేయొచ్చు. 6జీ ద్వారా ఎక్స్‌‌‌‌టెండెడ్ రియాలిటీ, మొబైల్ హోలోగ్రామ్ లాంటివి సాధ్యమవుతాయట.  హాలీవుడ్ సినిమాల్లో గాల్లో మనిషి ప్రత్యక్షమైనట్టు చూపిస్తారు. వాటిని హోలోగ్రామ్స్ అంటారు. మొబైల్‌‌‌‌తో అలాంటి హోలోగ్రామ్ క్రియేట్ చేయాలంటే 600 జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. 6జీతో అది సాధ్యం. సైన్స్ ఫిక్షన్‌‌‌‌ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనుకునే ఎన్నో విషయాలు 6జీ ద్వారా నిజం చేయొచ్చని సైంటిస్టులు అంటున్నారు. అయితే 6జీ విషయంలో మనదేశం ముందుండే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచదేశాలతో పాటుగానే 6జీ వైర్‌‌‌‌లెస్ టెక్నాలజీని ఇండియాకు తీసుకురావడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

క్షణాల్లో డౌన్​లోడ్​

చాలా రోజుల నుంచి ఎయిర్​టెల్​ నెట్​వర్క్​ వాడుతున్నా. 5జీ వచ్చిన తర్వాత ఇంటర్నెట్​ స్పీడ్​ బాగా పెరిగింది. కానీ.. నాకు 4జీలో వచ్చే స్పీడ్​ కూడా సరిపోయేది. నేను ఎక్కువగా యూట్యూబ్​లో వీడియోలు చూస్తుంటా. ఎప్పుడైనా 720p క్వాలిటీలో చూస్తా. హై క్వాలిటీలో చూస్తే నెట్​ బ్యాలెన్స్​ త్వరగా అయిపోతుంది. కాబట్టి 5జీ వచ్చినా స్ట్రీమింగ్​ విషయంలో అంత స్పీడ్​ నాకు అవసరం లేదు.  కాకపోతే వాట్సాప్​లో ఫొటోలు, వీడియోలు పంపినప్పుడు చాలా స్పీడ్​గా అప్​లోడ్​ అవుతున్నాయి. అప్పుడప్పుడు సినిమాలు డౌన్​లోడ్ చేస్తుంటా. ఇదివరకు ఒక సినిమా డౌన్​లోడ్​ చేయాలంటే 30 నుంచి 40 నిమిషాలు పట్టేది. ఇప్పుడు క్షణాల్లో అయిపోతోంది.  - అరుణ్​, హైదరాబాద్​