నిర్భయ దోషులను తొందరగా ఉరితీయాలి

నిర్భయ దోషులను తొందరగా ఉరితీయాలి

రాజ్యసభలో చైర్మన్​ వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు కోర్టు విధించిన ఉరిశిక్షను వీలైనంత తొందరగా అమలుచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉరిశిక్ష అమలు పదేపదే వాయిదా పడడంపై ఆయన రాజ్యసభలో స్పందించారు. ఈ విషయం సున్నితం, సీరియస్​ కూడా అని ఆయన కామెంట్ చేశారు. ఈమేరకు మంగళవారం సభలో ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్ మాట్లాడుతూ.. నిర్భయ దోషులు నలుగురికి కోర్టు ఉరి శిక్ష విధించిందన్నారు. అయితే, శిక్ష అమలు మాత్రం వాయిదా పడుతోందని చెప్పారు. ఈ కేసులో రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకొని శిక్ష త్వరగా అమలయ్యేలా చూడాలని సంజయ్​ కోరారు.

2012లో నిర్భయపై అత్యాచారం జరిగినపుడు దేశం మొత్తం రోడ్డెక్కి ఆందోళనలు చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు శిక్ష వాయిదా పడుతుంటే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ పరిస్థితిని కొనసాగించడం మంచిదికాదని, దోషులను వెంటనే ఉరి తీయాలని సంజయ్​ డిమాండ్​ చేశారు. అంతకుముందు సభలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న టీఎంసీ, కాంగ్రెస్​ ఎంపీలు కూడా ఈ చర్చ సందర్భంగా సైలెంట్​అయ్యారు.

మరిన్ని వార్తల కోసం..