దళితుడిని కావటంవల్లే నాపై కక్ష

 దళితుడిని కావటంవల్లే నాపై కక్ష

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కాసిపేట లింగయ్యతోపాటు మరో 10 మందిపై పెట్టిన కేసులను.. హైదరాబాద్ నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కొట్టేసింది. 2016లో అప్పటి సీపీ విక్రమ్ జిత్ దుగ్గల్, ఏసీపీ విష్ణు వారియర్, సీఐ వెంకటేశ్వర్లు కేసులు నమోదు చేశారు. గోదావరిఖని జనగామ శివారులోని 676/ఎ సర్వేనెంబర్ భూమిలోకి బలవంతంగా ఎంటరై.. ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేశారనే ఫిర్యాదుతో కేసులు పెట్టారు. పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపకపోవటంతో ఇవాళ కేసులు కొట్టేసింది కోర్టు. తప్పుడు కేసులు నమోదు చేసినవారిపై పరువునష్టం దావా వేయనున్నట్లు తెలిపారు కాసిపేట లింగయ్య. దళితుడిని కావటంవల్లే టీఆర్ఎస్ నేతలు, పోలీసులు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.