బ్యాంకులకు  లాభాలే లాభాలు

బ్యాంకులకు  లాభాలే లాభాలు

బిజినెస్ డెస్క్, వెలుగు:  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ –జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో కూడా బ్యాంకుల పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఐసీఐసీఐ, కోటక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద బ్యాంకులతో పాటు యెస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్,  ఏయూ  బ్యాంకులు కూడా లాభాల్లో వృద్ధి నమోదు చేశాయి. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ బ్యాంకుల నికర లాభం 10 –67 శాతం పెరిగింది.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.3,452 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.2,071 కోట్లతో పోలిస్తే ఇది 67 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐ) ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 33 శాతం పెరిగి రూ.6,234 కోట్లకు చేరుకుంది.  గ్రాస్  నాన్‌‌‌‌‌‌‌‌ పెర్ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌ అసెట్స్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏ) రేషియో 2.24 శాతం నుంచి 1.77 శాతానికి, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 0.62 శాతం నుంచి 0.40 శాతానికి మెరుగుపడ్డాయి. కానీ, క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తే బ్యాంక్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 0.37 శాతం నుంచి 0.40 శాతానికి పెరిగింది. బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.364 కోట్లు ప్రొవిజినింగ్ చేసింది. కిందటేడాది  జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ కేవలం రూ.23 కోట్లు మాత్రమే. కోటక్ బ్యాంక్  సగటు కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.55,081 కోట్ల నుంచి రూ.59,431 కోట్లకు పెరిగాయి. ఇది 8 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ.1,21,521 కోట్ల నుంచి రూ.1,19,817 కోట్లకు తగ్గాయి. 

యెస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

యెస్ బ్యాంక్   జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.342.52 కోట్ల నికర లాభం పొందింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన లాభంతో పోలిస్తే ఇది 10.26 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.1 శాతం పెరిగి రూ.1,999.6 కోట్లుగా రికార్డయ్యింది. బ్యాంక్ గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో  క్వార్టర్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం 20 బేసిస్ పాయింట్లు తగ్గి 2 శాతంగా నమోదయ్యింది. కానీ, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏ రేషియో  మాత్రం 20 బేసిస్ పాయింట్లు పెరిగి 1 శాతానికి చేరుకుంది. బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మెరుగుపడుతోందని,  ఫీజుల నుంచి వచ్చే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలకడగా పెరుగుతోందని యెస్ బ్యాంక్ సీఈఓ ప్రశాంత్ కుమార్ అన్నారు. యెస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 కొత్త బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఓపెన్ చేసింది. దీంతో బ్యాంక్ మొత్తం బ్రాంచుల సంఖ్య 1,212 కు చేరుకుంది. 

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నికర లాభం జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.288 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వచ్చిన రూ.201 కోట్లతో పోలిస్తే 43 శాతం వృద్ధి సాధించింది. ఎనలిస్టులు వేసిన రూ.257 కోట్ల ప్రాఫిట్ అంచనాలను దాటేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.613.57 కోట్ల నుంచి రూ.685.41 కోట్లకు పెరిగింది.  బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 4.08 శాతం ఉండగా, తాజా క్యూ1 లో 3.22 శాతానికి తగ్గింది. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 1.16 శాతం నుంచి ఒక శాతానికి మెరుగుపడింది.  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్ బ్యాంక్ షేర్లు గత ఏడాది కాలంలో 133 శాతం పెరగగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22 శాతం రిటర్న్ ఇచ్చాయి.

ఏయూ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఏయూ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.268 కోట్ల నికర లాభం రాగా, తాజా క్యూ1 లో రూ.387 కోట్లు వచ్చాయి. ఇది 44 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐ) 28 శాతం పెరిగి రూ.976 కోట్ల నుంచి రూ.1,246 కోట్లకు ఎగిసింది. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంట్రెస్ట్ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం 5.9 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.69,315 కోట్లుగా నమోదయ్యాయి. ఇయర్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్ ప్రకారం ఇది 27 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 1.96 శాతం నుంచి 1.76 శాతానికి మెరుగుపడింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌.. 

దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ జూన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టింది. కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే తాజా క్యూ1 లో బ్యాంక్ నికర లాభం 39.7 శాతం పెరిగి రూ.9,648 కోట్లకు ఎగిసింది. ఎనలిస్టులు వేసిన రూ.9,300 కోట్ల అంచనాను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌‌‌‌‌‌‌‌ఐఐ) 38 శాతం పెరిగి రూ.18,227 కోట్లకు చేరుకుంది. నెట్‌‌‌‌‌‌‌‌ ఇంట్రెస్ట్ మార్జిన్‌‌‌‌‌‌‌‌ 4.01 శాతం నుంచి 4.78 శాతానికి మెరుగుపడింది. కానీ, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డ్ అయిన 4.90 శాతం నుంచి తగ్గింది. జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,292 కోట్లను  ప్రొవిజన్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ పక్కన పెట్టింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.1,144 కోట్లుగా ఉంది. బ్యాంక్ గ్రాస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏ రేషియో  ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.81 శాతం ఉండగా,  తాజా క్యూ1 లో 2.76 శాతానికి మెరుగుపడింది. నెట్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏ రేషియో సీక్వెన్షియల్‌‌‌‌‌‌‌‌గా ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా ఉంది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన  0.70 శాతం నుంచి మెరుగుపడి 0.48 శాతంగా రికార్డయ్యింది. బ్యాంక్‌‌‌‌‌‌‌‌ రిటైల్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన అప్పులు వార్షికంగా 21.9 శాతం పెరిగాయి.