ఒక్కటయ్యారు.. చెరువు నింపారు

ఒక్కటయ్యారు.. చెరువు నింపారు

కావాల్సినంత భూమి ఉంది. సాగు చేయాలనే సంకల్పమూ ఉంది. కానీ నీటి కొరతే అసలైన సమస్య.అందుకే రైతులంతా ఏకమయ్యారు.భగీరథ ప్రయత్నంతో సమస్యకు పరిష్కారమార్గం చూపారు. పాడుపడిన భూముల్లో బంగారం పండిస్తూ … సస్యశ్యామలంగా మార్చారు.- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపూర్ గ్రామ రైతుల కృషిని అభినందిద్దo పదండి.

కరీంనగర్‌ , జగిత్యాల జిల్లా ల సరిహద్దుల్లో
కొడిమ్యాల మండలం. ఇదిప్పుడు
జగిత్యాల జిల్లా లో ఉంది. ఈ మండలంలోదే
గౌరాపూర్‌ గ్రామం. సుమారు పదిహేను
వందల వరకు జనాభా ఉంటుం ది. ఎక్కువగాసన్న, చిన్న కారు రైతులే. వీళ్లం దరివీ ఐదెకరాల కమతాలే. వరుణుడు కరుణిస్తేనే కానీ పంటలు పండవు. ఊరి చివరన ఉన్న చెరువు నిం డితేనే వ్యవసాయం చేయాలి. లేదంటే భూములన్నీ బీళ్లుగా మారతాయి. అయితే గ్రామానికి కిలోమీటరు దూరంలో పెద్దవాగు ప్రవహిస్తుంటుం ది. ఎస్సారెస్పీ (శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు) కాలువ నీళ్లు దీనిలోకి వదులుతారు. ఆ వాగు నుంచి ఇతర గ్రామాలకు నీళ్లు వెళ్తాయి కానీ గౌరాపూర్‌ కు మాత్రం రావు. ఎలాగైనా ఆ వాగు నీళ్లతో భూములు పండిం చాలని ఇక్కడి రైతుల ఆలోచన. భగీరథ ప్రయత్నం గ్రామ శివారున ఉన్న వాగులోకి ‘ఎస్సారెస్పీ ’
నీళ్లు వస్తాయి. దాని వల్ల గౌరాపూర్‌ కు ఎటువంటి ప్రయోజనం లేదు. బీళ్లుగా మారుతున్న భూములను పండిం చాలంటే గట్టి
ప్రయత్నమే చేయాలి. అందుకే రైతులంతా ఏకమయ్యారు. వాగు నీటిని చిన్న చెరువులోకి మళ్లిస్తే కానీ నీటి సమస్య తీరదు. దాని వల్ల భూగర్భజలాలు పెరిగి .. చెరువు కింద బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. సమస్య పరిష్కారం కోసం నలభై మంది గ్రామ ప్రజలు ఒకటయ్యారు. కొం త డబ్బునూ పోగు చేశారు. వాగు నుంచి పైపు వేసి, మోటారు బిగిం చారు. పైపులైన్‌‌‌‌ ద్వారా చెరువులోకి నీళ్లను మళ్లిం చారు. చెరువు నిం డుకోవడంతో భూగర్భజలాలు పెరిగాయి. బావుల్లో కూడా నీళ్లు పుష్కలంగా చేరాయి. ఆనందంగా పంటలు పండించుకుంటున్నారు. అయితే..ఈ నీటి సౌకర్యం తో కొం తమేరకే భూములు
పండుతున్నా యి. అదనంగా మరో మోటారు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.నిరంతర విద్యుత్‌ సరఫరా, ట్రాన్స్‌‌ఫార్మర్‌
ఏర్పాటుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు.అడ్డుగా రైల్వే ట్రాక్‌ ఈ గ్రామానికి మినహా, చుట్టు పక్కల గ్రామాలకు సాగు నీరందుతుంది. కానీ గౌరాపూర్‌ పక్కనే ఉన్న పూడూరుకు నీళ్లు అందడం లేదు. రైల్వే ట్రాక్‌‌‌‌ వల్లే నీళ్లు అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్‌‌‌‌ అవతల, ఇవతల కాలువలు ఉన్నా యి. సొరంగం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గా ల
ద్వారా నీళ్లం దిచేలా కృషి చేయాలి. అప్పుడే నీటి కొరత తీరుతుంది. ఎన్నిసార్లు విన్నవించి నా అధికారులు పట్టించు కోవడం లేదంటున్నారు రైతులు. ఆ గ్రామస్తు లకు కావాల్సినంత భూమి ఉంది. సాగు చేయాలనే సంకల్పమూ ఉంది. కానీ నీటి కొరతే అసలైన సమస్య. అందుకే రైతులంతా ఏకమయ్యారు .భగీరథ ప్రయత్నంతో సమస్యకు పరిష్కారమార్గం చూపారు. పాడుపడ్డ
భూముల్లో బంగారం పండిస్తూ …సస్యశ్యామలంగా మార్చారు. ఆ ఊరి రైతుల కృషి తెలుసుకుం టే…వ్యవసాయంపై ఆసక్తి కలగడం ఖాయం.