ఎల్ఎండి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల వారు జాగ్రత్త

ఎల్ఎండి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల వారు జాగ్రత్త

రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోయర్ మానేరు డ్యాంకు వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నాలుగు ఎత్తి దిగువకు నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్ట్ లోకి 13వేల 905 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ లో 24 టీఎంసీలకు గాను 21.1 టీఎంసీల నీరు ఉంది. పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఎస్ఈ శివకుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని, LMD పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు.

ప్రధానంగా గొర్ల, బర్ల కాపరులు, చేపల వేటకు పోయే వారు నది లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రాజెక్టు కెపాసిటీ 21.00 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. చిగురుమూడులో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇందుర్తి - కోహెడ బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.