రైల్వేలో​ గూడ్స్​ గార్డ్​, స్టేషన్​ మాస్టర్​ జాబ్స్​

రైల్వేలో​ గూడ్స్​ గార్డ్​, స్టేషన్​ మాస్టర్​ జాబ్స్​

రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే కామన్ డిపార్ట్‌‌‌‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా 596 స్టెనోగ్రాఫర్ , గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీలు: స్టెనోగ్రాఫర్-–4, సీనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్–154, గూడ్స్ గార్డ్-–46, స్టేషన్ మాస్టర్-–75, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్-–150, జూనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్-–126, అకౌంట్స్ క్లర్క్-–37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హత: అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 50 నిమిషాల ట్రాన్స్‌‌‌‌క్రిప్షన్ సమయంతో పాటు 10 నిమిషాల వ్యవధికి నిమిషానికి 80 పదాల షార్ట్‌‌‌‌హ్యాండ్ వేగం కలిగి ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దాని తత్సమాన అర్హత కలిగి ఉండాలి. నవంబర్​ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సెలెక్షన్​: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.rrccr.com చూసుకోవాలి.