ఎనిమిదేండ్ల తర్వాత రిప్లయ్​ వచ్చింది

V6 Velugu Posted on Oct 20, 2021

చాలామంది జాబ్స్​ కోసం ఆన్​లైన్​లో వెతుకుతారు. అప్లయ్​ చేస్తారు. డీటైల్స్​  అందిస్తారు. జాబ్​కి అప్లయ్​ చేశాక కన్ఫార్మ్​ అయిందా? లేదా? అనేది  వారం పది రోజుల్లో చెబుతారు. కానీ, అమెరికాకు చెందిన జాయ్​ జాన్సన్​కు మాత్రం ఎనిమిదేళ్ల తర్వాత రిప్లయ్​ వచ్చింది. అది చూసి షాక్​ అయిన ఆమె దాన్ని ఇంటర్నెట్​లో పోస్ట్​ చేసింది. జాయ్​ జాన్సన్​కు ఇప్పుడు 39 ఏండ్లుంటాయి. 2013లో జాబ్​ ​ కోసం చాలా వెతికింది. లింక్డిన్​లో ప్రొఫైల్​ క్రియేట్​  చేసి జాబ్​ నోటిఫికేషన్లు పడినప్పుడల్లా అప్లయ్​ చేసేది. అలా ఒకసారి ఓ స్కూల్​లో టెక్నికల్​ అసిస్టెంట్​ జాబ్​కి అప్లయ్​ చేసి. వాళ్ల నుంచి రిప్లయ్​ వస్తుందని ఎదురు చూసింది.  కానీ, ఆ టైంలో ఎలాంటి రిప్లయ్​ రాలేదు. ఆ తర్వాత ఎన్ని జాబ్స్​ ట్రై చేసినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దాంతో తానే ‘zoebeebeauty’ అనే స్కిన్​ కేర్​ స్టార్టప్​ను పెట్టింది. అది అమెరికాలో ఇప్పుడు ఎంతో ఫేమస్​ కూడా.  ఈ క్రమంలో ఆమెకు ఇటీవల లింక్డిన్​లో ఓ నోటిఫికేషన్​ వచ్చింది. ‘ థాంక్స్​ ఫర్​ రీచింగ్​ ఔట్​’ అంటూ జాబ్ రిక్వెస్ట్​ రిజెక్ట్​ చేసినట్టు వచ్చిన మెసేజ్​ అది.  2013లో అప్లయ్​ చేసిన జాబ్​కు ఇప్పుడు వచ్చిన రిప్లయ్​. రిప్లయ్‌‌ను   చూసిన జాయ్​  నవ్వుకుంది. దాన్ని స్క్రీన్​షాట్ తీసి ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. అది ఇప్పుడు సోషల్​మీడియాలో చాలా స్పీడ్​గా తిరుగుతోంది.

Tagged 8 years, life style, reply,

Latest Videos

Subscribe Now

More News