ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు సెప్టెంబర్‌లో?

ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు సెప్టెంబర్‌లో?

పద్నాలుగేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఐపీఎల్‌‌ సీజన్​ అర్ధంతరంగా నిలిచిపోవడం ఇదే మొదటిసారి. దాంతో, టోర్నీని ఎప్పుడు కంప్లీట్‌‌ చేస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై  బీసీసీఐ, ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, సెప్టెంబర్‌‌ విండో మాత్రమే ఇందుకు అనుకూలంగా ఉందని తెలుస్తోంది.  షెడ్యూల్‌‌ ప్రకారం ఈ లీగ్‌‌ ముగిసిన వెంటనే టీమిండియా.. ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు వెళ్తుంది. జూన్‌‌లో ఇంగ్లండ్‌‌లో అడుగు పెట్టే టీమిండియా.. న్యూజిలాండ్‌‌తో వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌‌తో (ఆగస్టు–సెప్టెంబర్‌‌) ఐదు టెస్టుల సిరీస్‌‌లో పాల్గొంటుంది. ఈ మధ్యలో జులైలో  కోహ్లీసేన ఖాళీగా ఉంటుంది. కానీ, ఇంత తక్కువ టైమ్‌‌లో అన్ని దేశాల ప్లేయర్లను ఒక్క చోటుకు తీసుకొచ్చి లీగ్ ఆడించి... ఇండియాను మళ్లీ ఇంగ్లండ్‌‌కు పంపించడం కుదరకపోవచ్చు. ఇంగ్లండ్‌‌ టూర్‌‌ నుంచి  తిరిగొచ్చిన తర్వాత టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌‌తో పోటీ పడనుంది. ఆ తర్వాత అక్టోబర్‌‌–నవంబర్‌‌లో టీ20 వరల్డ్‌‌కప్‌‌నకు ఆతిథ్యం ఇస్తుంది. కాబట్టి ఐపీఎల్‌‌ 14ను కంప్లీట్‌‌ చేసేందుకు సెప్టెంబర్‌‌ విండో ఒక్కటే సానుకూలంగా కనిపిస్తోంది. ‘సెప్టెంబర్‌‌ విండోను బోర్డు పరిశీలించే అవకాశం ఉంది. అప్పటికి ఇండియా–ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌ కంప్లీట్‌‌ అవుతుంది. ఒకవేళ సిచ్యువేషన్‌‌ నార్మల్‌‌గా మారి, ఫారిన్‌‌ ప్లేయర్లు అందుబాటులో ఉంటే ఈ విండోను యూజ్‌‌ చేసుకొని లీగ్‌‌ను పూర్తి చేయాలి. ఒకరకంగా ఇది టీ20 వరల్డ్‌‌కప్‌‌నకు ప్రిపరేషన్‌‌గా కూడా పనికొస్తుంది’ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. 

పీఎస్‌‌ఎల్‌‌లో అలా..
గతేడాది  పాకిస్తాన్‌‌ సూపర్‌‌ లీగ్‌‌ (పీఎస్‌‌ఎల్‌‌)  ఐదో సీజన్‌‌ కూడా కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. 2020 ఫిబ్రవరి 20వ తేదీన మొదలైన ఈ లీగ్‌‌.. కరోనా దెబ్బకు మార్చిలో ఆగిపోయింది. ఫారిన్‌‌ ప్లేయర్లు విత్‌‌డ్రా అవడంతో  లీగ్‌‌ను మధ్యలో నిలిపివేశారు. చివరకు నవంబర్‌‌లో  మిగిలిన నాకౌట్‌‌ రౌండ్‌‌ను కంటిన్యూ చేశారు. కానీ, చాలా మంది ఫారిన్‌‌ ప్లేయర్లు లీగ్‌‌ లాస్ట్‌‌ స్టేజ్‌‌కు దూరమయ్యారు.