ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. మళ్లీ కాంగ్రెస్దే అధికారం

ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..  మళ్లీ కాంగ్రెస్దే అధికారం

ఛత్తీస్‌గఢ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం (నవంబర్ 30న) సాయంత్రం విడుదలయ్యాయి. ఛత్తీస్​గఢ్​లో రెండోసారి కూడా కాంగ్రెస్​ అధికారం చేజిక్కించుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్​ఫలితాలు చెప్పాయి. ఎగ్జిట్​ పోల్స్​లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసుకుందాం.

ఛత్తీస్​గఢ్​లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్​ పోల్స్ ఫలితాలు తేల్చాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ 50 సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి.

ఛత్తీస్​గఢ్​లో బీజేపీకి మళ్లీ నిరాశే ఎదురైంది. హస్తం పార్టీవైపే ఛత్తీస్​గఢ్​ప్రజలు మొగ్గచూపారని ఎగ్జిట్​పోల్స్ ఫలితాలు తెలిపాయి. ఈ సారి బీజేపీ 36 నుంచి 46 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెప్పాయి. 

రెండు విడతల్లో ఎన్నికలు.. 

ఛత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరిగిగాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. మిగతా 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. తొలి విడతలో నక్సల్​ ప్రభావిత బస్తర్​ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయి. 

2018 ఎన్నికల్లో 68 స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు రెండో విడత పోలింగ్‌ జరుగుతున్న 70 స్థానాల్లో క్రితం సారి కాంగ్రెస్‌ 50చోట్ల గెలుపొందగా, బీజేపీ 13 సీట్లలో విజయం సాధించింది. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ నాలుగు, బీఎస్​పీ రెండు స్థానాల్లో గెలుపొందాయి.

ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 సీట్లు
46 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌  

కాంగ్రెస్‌ 46-56, బీజేపీ 30-40 ఇతరులు 3-5

యాక్సిస్‌ మైఇండియా  

కాంగ్రెస్‌ 40-50, బీజేపీ 36-46 ఇతరులు 1-5

టీవీ5 న్యూస్‌   

కాంగ్రెస్‌ 54-66, బీజేపీ 29-39 ఇతరులు 0-2

పీపుల్స్‌ పల్స్‌   

కాంగ్రెస్‌ 54-64, బీజేపీ 29-39 ఇతరులు 0-2

ABP న్యూస్-C ఓటర్   

బీజేపీ 36-48, కాంగ్రెస్ 41-53

ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా 

బీజేపీ 36-46, కాంగ్రెస్ 40-50

ఇండియా TV- CNX  

బీజేపీ  30-40, కాంగ్రెస్ 46-56

జన్ కీ బాత్  

బీజేపీ 34-45, కాంగ్రెస్ 42-53  

టుడేస్ చాణక్య 

బీజేపీ 25-41, కాంగ్రెస్ 49-65

దైనిక్ భాస్కర్ 

బీజేపీ 35-45, కాంగ్రెస్ 46-55