గద్వాల కాంగ్రెస్ టికెట్ పై రగడ .. గాంధీభవన్ ముందు రేవంత్ దిష్టిబొమ్మ దహనం

గద్వాల కాంగ్రెస్ టికెట్ పై రగడ .. గాంధీభవన్ ముందు రేవంత్ దిష్టిబొమ్మ దహనం

గద్వాల, వెలుగు : గద్వాల కాంగ్రెస్ టికెట్ ను సరిత తిరుపతయ్యకు కేటాయించడంపై రగడ మొదలైంది. గద్వాల నుంచి టికెట్ ఆశించిన టీపీసీసీ సెక్రటరీ విజయ కుమార్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు గాంధీ భవన్ కు చేరుకొని ఆందోళన చేశారు. రూ.5కోట్లు, పదెకరాల భూమి తీసుకొని సరితకు టికెట్ ఇచ్చారని ఆరోపిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

15 ఏండ్లుగా పార్టీ జెండా మోసిన వారిని పక్కనపెట్టి ఇటీవల పార్టీలో చేరినవారికి టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. రేవంత్​కు దమ్ము, ధైర్యం ఉంటే పెద్దమ్మ గుడికి వచ్చి టికెట్లు అమ్ముకోలేదని ప్రమాణం చేయాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.