రామానుజాచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీక

రామానుజాచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీక
  • రామానుజాచార్యులు సమానత్వం కోసం కృషి చేశారు
  • ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి
  • బీజేపి సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి

స్టాట్యూ ఆఫ్ ఇక్వాలిటీ (రామానుజాచార్యల విగ్రహం) ఓ అద్భుతం కట్టడమని బీజేపి సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన మంగళవారం ముచింతల్లోని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించి  చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా  వివేక్ కు తీర్థ, ప్రసాదాలు అందజేసిన చిన్నజీయర్ స్వామి అనంతరం రామానుజాచార్యుల విగ్రహం, ఆశ్రమ విశిష్టత గురించి ఆయనకు వివరించారు. అనంతరం ఆశ్రమంలోని రామానుజాచార్యుల భారీ విగ్రహం, గోల్డెన్ స్టాచు, అష్ట దళ పద్మ తోరణం, 108 దివ్య ఆలయాల ప్రాంగణం, యాగ శాల, భోజన శాలను వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాట్యూ ఆఫ్ ఇక్వాలిటీ (రామానుజాచార్యల విగ్రహం) సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వెయ్యేళ్ల కిందటే మనుషులంతా ఒక్కటేనంటూ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి రామానుజాచార్యులు అని కొనియాడారు. రామానుజాచార్యులు సమానత్వం కోసం కృషి చేశారని, ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. భారత దేశమంతా కలియ తిరిగి కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని రామానుజాచార్యులు ప్రబోధించారన్నారు.  రానున్న రోజులో స్టాట్యూ ఆఫ్ ఇక్వాలిటీ ఒక పుణ్య స్థలంగా నిలువనుందని వివేక్ అన్నారు.

ఇవి కూడా చదవండి..

కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉంది