అధికారుల సస్పెన్షన్ ఎత్తివేయాలి.. తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్ 

అధికారుల సస్పెన్షన్ ఎత్తివేయాలి.. తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్ 
  • అధికారుల సస్పెన్షన్ ఎత్తివేయాలి
  • తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్ 

ముషీరాబాద్, వెలుగు : నల్గొండ జిల్లాలో అకారణంగా  సస్పెండ్ చేసిన అగ్రికల్చర్ అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకొని సొంత జిల్లాలకు పంపించాలని తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్ బొమ్మిరెడ్డి కృపాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణగూడ లోని ఓ హోటల్​ లో అసోసియేషన్ స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అనంతరం కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండల వ్యవసాయ అధికారులు సీజన్‌కు ముందే ఎరువుల ప్రణాళికను జిల్లా అధికారులకు సమర్పించినప్పటికీ సరఫరాలో జాప్యానికి బాధ్యులను చేసి ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం లేకుండా ఏడుగురిని సస్పెండ్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

కొంతమందిని ఇతర జిల్లాలకు బదిలీ చేయడం సరికాదన్నారు.  ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి, కానీ వ్యవసాయ శాఖలో మాత్రం ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు. అర్హులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి కృపాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విజయనిర్మల, సంతోషి, మానస, రమ్యశ్రీ, గిరిప్రసాద్, యాకయ్య తోపాటు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.