బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం కోసం స్పెషల్ బడ్జెట్ 

బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం కోసం స్పెషల్ బడ్జెట్ 

హైదరాబాద్: ప్రసిద్ధ దేవాలయం బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా జరపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని, అమ్మవారి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని తలసాని చెప్పారు. వచ్చే నెల 13న కల్యాణం, 14న రథోత్సవం ఉంటుందని.. లైవ్ టెలీకాస్ట్ ద్వారా భక్తులు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 

‘ముఖ్యమంత్రి కేసీఆర్ దైవభక్తుడు. బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం ఘనంగా జరపాలని కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించారు. బోనాలు, కల్యాణంతోపాటు ఇతర పండుగల్ని, మన సంస్కృతిని గొప్పగా చాటాలని ఆయన నిర్ణయించారు. ఈ మహోత్సవానికి 80 వేలకు పైగా జనాలు హాజరవుతారని భావిస్తున్నాం. ఇక్కడ ఓ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. అమ్మవారి దయతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నా. కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజల్ని అమ్మవారు కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం’ అని తలసాని చెప్పారు.