
సల్మాన్ ఖాన్ హీరోగా టైగర్ ప్రాంఛైజీలో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించగా, ఇప్పుడు మూడో చిత్రంగా ‘టైగర్ 3’ వస్తోంది. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకుడు. ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించాడు. టీజర్, ట్రైలర్‌తో పాటు ఇటీవల విడుదలైన ‘లేకే ప్రభు కా నామ్’ పాటతో సినిమాపై అంచనాలు పెంచిన యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది. ‘టైగర్ ఈజ్ బ్యాక్’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో సల్మాన్ ఖాన్.. వన్ మ్యాన్ ఆర్మీలా శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి పోరాటం చేస్తున్నాడు. మరోవైపు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీతో పాటు తెలుగు, తమిళ, భాషల్లో విడుదల కానుంది.