హై ఎనర్జీ లేజర్ వెపన్ ను తయారు చేసిన యూఎస్

హై ఎనర్జీ లేజర్ వెపన్ ను తయారు చేసిన యూఎస్
  • సక్సెస్ ఫుల్​గా టెస్ట్ చేసినట్లు ప్రకటన

వాషింగ్టన్: గాల్లో ఎగురుతున్న విమానాలను నాశనం చేయగల అత్యాధునిక లేజర్ వెపన్ ను సక్సెస్ ఫుల్ గా టెస్ట్ చేసినట్లు అమెరికా శనివారం ప్రకటించింది. యూఎస్ నేవీ యుద్ధనౌక.. విమానాలను నాశనం చేయగల కొత్త హై-ఎనర్జీ లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించిందని నేవీ పసిఫిక్ ఫ్లీట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. యూఎస్ పోర్ట్ ల్యాండ్ యుద్ధనౌక నుంచి ‘హై-ఎనర్జీ క్లాస్ సాలిడ్-స్టేట్ లేజర్ ఫస్ట్ ఫేజ్’ పరీక్షలు ఈ నెల 16న నిర్వహించినట్లు తెలిపింది. గాల్లో ఎగురుతున్న డ్రోన్ విమానాన్ని కూల్చిన ఫొటోలు, వీడియో విడుదల చేసింది. లేజర్ ఎనర్జీ కెపాసిటీని వెల్లడించలేదు. కానీ, ఇది 150 కిలోవాట్ల లేజర్ అని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ రిపోర్టు వెల్లడించింది.