బంగారం వాడకం మరింత పెరుగుతది

బంగారం వాడకం మరింత పెరుగుతది

హైదరాబాద్, వెలుగు: 2022లో భారత్‌‌‌‌లో బంగారం వాడకం మరింత పెరగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూసీజీ)  అంచనా వేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది వాడకం 79 శాతం పెరిగిందని, రిటైల్ జ్యువెలరీ అమ్మకాలు భారీగా రికార్డయ్యాయని తెలిపింది. 2021లో బంగారం వాడకం 797.3 టన్నుల వరకు ఉండగా, ఈసారి -850 టన్నులు వరకు ఉండొచ్చని, 2021లో డిమాండ్ ఆరేళ్లలో అత్యధికమని కౌన్సిల్ డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఓ సోమసుందరం  అన్నారు. గత 10 ఏళ్లలో భారత్​లో డిమాండ్ సగటున 769.7 టన్నుల వరకు ఉంది.  ఇండియాలో డిమాండ్ వల్ల గ్లోబల్​గా ధరలు పెరుగుతాయి కానీ భారతదేశపు  వాణిజ్య లోటును  పెరుగుతుంది. పడిపోతున్న రూపాయి వల్ల ఇది వరకే లోటు పెరుగుతోంది. రిస్ట్రిక్షన్ల వల్ల పెళ్లిళ్లు ఘనంగా జరగకున్నా ఎంతోకొంత బంగారం అమ్ముడవుతోందని సోమసుందరం అన్నారు.  డిసెంబర్ క్వార్టర్లో, బంగారం వినియోగం ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది.  రికార్డు స్థాయిలో 343.9 టన్నుల పసిడి అమ్ముడయింది.  ప్రస్తుతం బంగారం ధరల 10 గ్రాములకు దాదాపు రూ.48 వేల  వరకు ఉంది. 2020 ఆగస్టులో ధర   రూ. 56,191 మార్కును తాకింది. ఇన్వెస్టర్లు కాయిన్లు, బార్లు ఎక్కువగా కొన్నారు. 2022లో వీటి అమ్మకాలు 43శాతం పెరిగి186.5 టన్నులకు చేరుకోవచ్చని కౌన్సిల్ పేర్కొంది.