కాకతీయుల శిల్పకళా సంపద అద్భుతం.. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ ప్రశంస

కాకతీయుల శిల్పకళా సంపద అద్భుతం.. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ ప్రశంస

ఖిలా వరంగల్ ( మామునూర్) వెలుగు : కాకతీయుల రాజధాని ఓరుగల్లు కోటలోని శిలా తోరణం అద్భుతమని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ ప్రశంసించారు. శుక్రవారం  మంత్రి కుటుంసమేతంగా ఓరుగల్లు కోటను సందర్శించి కాకతీయుల శిల్పకళ, వాస్తుశిల్ప నైపుణ్యాన్ని పరిశీలించారు. 

పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి యాదవ్ కాకతీయుల చరిత్ర, వాస్తు నిర్మాణ శైలి, కళాఖండాల విశిష్టతను వివరించారు. శిలా తోరణం, ఖుష్ మహల్, ఏకశిలా కొండపైన స్వయంభు ఆలయం తదితర ప్రదేశాలను మంత్రి సందర్శించారు. శిలా తోరణం చూసి కాకతీయ శిల్పుల గొప్పతనానికి నిదర్శనమని ప్రత్యేకంగా ప్రశంసించారు. రాతికోటపైన సెంట్రీ టవర్ పైకి వెళ్లి, మెట్ల నిర్మాణాన్ని చూశారు.   

వెంకటాపూర్ (రామప్ప): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను మంత్రి రోహిత్ ఠాకూర్ సందర్శించారు. ఆలయ అర్చకులు  స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.