నరసింహ్మాస్వామి ఆలయంలో చోరీ

నరసింహ్మాస్వామి ఆలయంలో చోరీ

ఖమ్మం టౌన్, వెలుగు :  రఘునాథపాలెం మండలంలోని చిమ్మాపూడిలో ఉన్న లక్ష్మీనరసింహ్మాస్వామి ఆలయంలో శనివారం రూ.60 వేల విలువైన సొత్తును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. గుడిలో ఉన్న పెద్ద గంటలు 2, చిన్న గంట 1, రాగి కలిశాలు 115,  దీపారాధన చెంబులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఆదివారం గ్రామపెద్దలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.