
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జరిగిన చోరీ కేసులో సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గర్భగుడి లోపలికి వెళ్లే మార్గంలో ఉన్న కిటికీని పగలగొట్టి దొంగ లోపలికి వెళ్లాడు. తర్వాత రెండు హుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఒకే హుండీ తెరుచుకోవటంతో అందులోని డబ్బు, వెండి, బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగానే దొంగను పట్టుకుంటామంటున్నారు పోలీసులు.