కొండగట్టులో దొంగలు మరోసారి హల్‌చల్‌

కొండగట్టులో దొంగలు మరోసారి హల్‌చల్‌

ప్రముఖ పుణ్యక్షేత్రమైన  కొండగట్టులో దొంగలు మరోసారి హల్‌చల్‌ చేశారు. గత నెల  ఆలయాన్ని టార్గెట్ చేసిన దొంగలు ఈ సారి భక్తులను టార్గె ట్ చేశారు. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తులసెల్ ఫోన్లు, నగదును అపహరించారు. దీనిపై భక్తులు పోలీసులు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ లో రికార్డు అయిన వీడియో ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గత నెల ఆలయంలో జరిగిన చోరీ  కేసులో జగిత్యాల పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంజన్న వెండి విగ్రహం సహా మొత్తం 5 కిలోల వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడినట్టుగా వెల్లడించారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా..చోరీకి ప్లాన్ చేసిందని..ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు.  పరారీలో ఉన్న మరో నలుగురి కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.