లెజెండ్ ఈజ్ బ్యాక్ ఎగైన్

లెజెండ్ ఈజ్ బ్యాక్ ఎగైన్

టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల హిట్ చిత్రాలను మరోసారి థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు స్టార్ హీరోల  సినిమాలు రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌లోనూ సత్తా చాటాయి.  తాజాగా బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ  రూపొందిన ఈ  చిత్రం  పదేళ్ల  క్రితం వచ్చి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది.

తాజాగా మార్చి 30న మళ్లీ  విడుదలవుతోంది. సెలబ్రేటింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ లెజెండ్ పేరుతో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌లో నటించారు.

‘నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి. తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్.. నో రూల్స్.. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది.. లైఫ్‌‌‌‌‌‌‌‌లో కొన్ని వినకూడదు, చూడకూడదు అని ఫిక్స్ అవుతా.. పొరపాటున అవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది.. నువ్వు భయపెడితే భయపడటానికి ఓటరును అనుకున్నావా..షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కాల్చి పడేస్తా..  హిస్టరీ రిపీట్​’ లాంటి  డైలాగ్స్ అభిమానులను థియేటర్స్‌‌‌‌‌‌‌‌కు రప్పించేలా ఉన్నాయి.