ఢిల్లీకి సీఎం రేవంత్.. కొత్త టీపీసీసీ ఎవరు?

ఢిల్లీకి సీఎం రేవంత్.. కొత్త టీపీసీసీ ఎవరు?

పీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ నేతలు. ఈనెల 27తో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు  చేపట్టి మూడేళ్లు పూర్తవుతుంది. దీంతో ఈనెలాఖరులోగా కొత్త పీసీసీ ఎంపిక ఉంటందని పార్టీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొత్త పీసీసీ కోసం కసరత్తు చేస్తోంది ఏఐసీసీ. సీనియార్టీతో పాటు పార్టీకి విధేయంగా  ఉన్న వారికే పార్టీ పగ్గాలు ఉంటాయని తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి కూడా పీసీసీ ఎంపీకపై తన అభిప్రాయం చెప్పినట్లు టాక్ నడుస్తోంది. రీసెంట్ గా జరిగిన చిట్ చాట్ లో సైతం ప్రముఖ వ్యక్తికి పీసీసీ పదవి వస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ఇక రేపు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. దీనిలో పార్లమెంట్ ఫలితాలపై, ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలపై చర్చ జరగనుంది. అదే విధంగా పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల మార్పుపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.