టెలికం సెక్టార్లో మోనోపోలీ రాదు : మినిస్టర్​ అశ్విని వైష్ణవ్​

 టెలికం సెక్టార్లో మోనోపోలీ రాదు : మినిస్టర్​ అశ్విని వైష్ణవ్​

న్యూఢిల్లీ: ఇండియా టెలికం సెక్టార్లో మోనోపోలీ లేదా డ్యూయోపోలీకి అవకాశమే ఉండదని, నిలకడైన ప్లేయర్​గా ప్రభుత్వ రంగంలోని  బీఎస్​ఎన్​ఎల్​ ఎమర్జ్​ అవుతోందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్​ చెప్పారు. వోడాఫోన్​ ఐడియా లిమిటెడ్​ ఆర్థికంగా బలహీనమైన నేపథ్యంలో దేశ టెలికం రంగంలో డ్యూయోపోలీ రానుందా అనే ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.

మోనోపోలీ (ఒకే ప్లేయర్​) కి ఛాన్సేలేదంటూ, డ్యూయోపోలీ (ఇద్దరు ప్లేయర్లు) కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ముకేష్​ అంబానీ కంపెనీ రిలయన్స్​ జియోతోపాటు, భారతి ఎయిర్​టెల్​, వోడాఫోన్​ ఐడియాలు ఉన్నాయి. 5 జీ రోలవుట్​లోనూ జియో పెద్ద ఆపరేటర్​గా నిలుస్తోంది.