ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్: రూ.349తో అమెజాన్ ప్రైమ్.. ఇంకా మరిన్ని..

ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్: రూ.349తో అమెజాన్ ప్రైమ్.. ఇంకా మరిన్ని..

ఇటీవల నష్టాల్లో కూరుకుపోతున్న టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కనీవినీ ఎరుగని ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. భారీ పోటీని తట్టుకుంటూ కస్టమర్లు చేజారి పోకుండా చూసుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఊహించని రీతిలో ప్లాన్స్ అనౌన్స్ చేసింది. రెగ్యులర్ రీచార్జ్ బెనిఫిట్స్‌తో పాటు లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తోంది. అలాగే గతంలో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఇచ్చినట్లుగా ఇప్పుడు ప్రీపెయిడ్ వినియోగదారులకు కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రీప్షన్ అఫర్ చేస్తోంది.

ప్లాన్స్ ఇవీ:

కేవలం రూ.179 రీచార్జ్‌తో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు ఇస్తోంది ఎయిర్‌టెల్. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇవే బెనిఫిట్స్ రూ.149 ప్లాన్‌తో కూడా ఇస్తున్నప్పటికీ.. మరో రూ.30 ఎక్కువ పెడితే ఏకంగా రెండు లక్షల రూపాయలకు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌ కల్పిస్తోంది. అయితే 18 నుంచి 54 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.

28 రోజుల వ్యాలిడిటీ ఉండే రూ.249 రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.4 లక్షల బీమా కూడా అందిస్తోంది ఎయిర్‌టెల్.

28 రోజుల వ్యాలిడిటీ ఉండే రూ.349 ప్రీపెయిడ్ రీచార్జ్‌తో రోజుకు 2జీబీ, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ఇస్తోంది ఎయిర్‌టెల్. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.