
చాలా మందికి టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. రోజుకు ఒకటీ, రెండు సార్లు అంటే ఓకే. కానీ కొంతమంది గంటకో సారి, వీలు కుదిరినప్పుడల్లా టీ తాగుతూ కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారికి ప్రయోజనాల కన్నా దుష్ర్పయోజనాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. టీ ఎక్కువగా తాగే వారిలో ఐరన్ శాతం తగ్గుతుందని, టీ ఆకుల్లోని ఆర్గానిక్ కాంపౌండ్లు ఐరన్ శోషించుకోవడాన్ని ఆపేయాస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది శాఖాహార, మాంసాహారుల్లో కంటే ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని పరిశోధన తెలిపింది.
అతిగా టీ తాగటం వల్ల వచ్చే నష్టాలు
తరచూ టీ తాగే వాళ్లు లేదా టీకి అడిక్ట్ అయిన వాళ్లు ధీర్ఘకాలంలో చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారని ఓ పరిశోధన తెలిపింది.
- రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రొస్టేట్ క్యాన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది.
- మోతాదుకు మించి టీ తాగితే ఎముకల పటుత్వంలో సమస్యలు వస్తాయి. అంతే కాదు ఎముకలు తొందరగా అరిగిపోతాయి.. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
- శరీరంలోని ఐరన్ పైనా ప్రభావం చూపిస్తుంది.
- ఎసిడిటీ సమస్యలు, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
- పన్నెండు ఏళ్లలోపు వయసున్న పిల్లలకు టీ అస్సలు తాగించకూడదు. టీలో ఉండే కెఫిన్ పిల్లల శరీరంలో నిల్వ ఉండే పోషకాలను నాశనం చేస్తుంది.
- ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి
- టీ ఆకులలో ఉండే కెఫిన్ అనే పదార్థం ఉత్తేజితం చేయడంతో పాటు ఒత్తిడికి కూడా గురి చేస్తుంది.
- వైట్ టీ, గ్రీన్ టీలతో పోలీస్తే కెఫిన్ బ్లాక్ టీలోనే ఎక్కువగా ఉంటుంది.
- టీ ఎక్కువగా తాగే వారిలో నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి.
- టీలోని మెలటోనిన్ అనే హార్మోన్ శరీరాన్ని నిద్రకు సహకరించేలా చేస్తుంది. కానీ ఎక్కువగా టీ తాగేవారిలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటం వలన నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. తద్వారా తలనొప్పి, తల తిరగడం వంటి మొదలైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
- రోజులో పలు మార్లు టీ తాగే వారికి నోరు పోడిబారడంతో పాటు నోరు చేదుగా మారుతుంది.