ఆ ముగ్గురికీ కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నయ్

ఆ ముగ్గురికీ కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నయ్

న్యూఢిల్లీ: టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో సారథిగా ఉండటం పెద్ద ఛాలెంజ్ అని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అన్నాడు. భారత జట్టును టెస్టు, వన్డే, టీ20ల్లో కెప్టెన్ గా ముందుకు నడిపే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. అయితే తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని తెలిపాడు. బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ ఉండటం భారత్ బలమన్నాడు. పేసర్ బుమ్రా, డాషింగ్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ లో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయన్న రోహిత్.. వాళ్లు పరిణతి కలిగిన క్రికెటర్లు అని మెచ్చుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో సరైన మార్గనిర్దేశం చేస్తే ఆ ముగ్గురూ మరింత రాటుదేలుతారని వ్యాఖ్యానించాడు. వారికి సాయం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నాడు. 

‘బుమ్రా, రాహుల్, పంత్ కు భవిష్యత్తులో భారత జట్టును నడిపే సత్తా ఉంది. వారికి అవసరమైనప్పుడు సూచనలు ఇవ్వడానికి నేను రెడీ. మేం అందరమూ అలాగే ఎదిగాం. మాకు కూడా ఎవరో ఒకరు చేయూతను ఇచ్చారు. సీనియర్ల సలహాలు, సూచనలు చాలా ఉపయోగపడతాయి. ఆటగాడిగా టీమ్ అవసరాలకు తగ్గట్లుగా ఆడటం, బాధ్యతలను నెరవేర్చడంలో బుమ్రా, రాహుల్, పంత్ మంచి నైపుణ్యం సాధించారు. అయితే వీరిని మేం ఒత్తికిడి లోనవ్వకుండా చూసుకుంటాం. వీళ్లు జట్టులో చాలా ముఖ్యమైన ప్లేయర్లు. వీళ్లు గేమ్ ను ఎంజాయ్ చేస్తూ ఆడాలి. స్వేచ్ఛగా తమ ఆటను ఆడాలి. అది వ్యక్తిగతంగా వారితో పాటు టీమ్ కూ మేలు చేకూర్చుతుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, శ్రీలంకతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్ కు ముందు బుమ్రాను భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. 

మరిన్ని వార్తల కోసం..

ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

ప్రియాంకకు బీజేపీ కార్య‌క‌ర్త షేక్ హ్యాండ్

‘అంటే సుందరానికీ’ నుంచి అప్డేట్