జాబ్ ఇప్పిస్తామని.. దొంగను చేశారు.. మైనర్ తో పాటు మరొకరు అరెస్ట్

జాబ్ ఇప్పిస్తామని.. దొంగను చేశారు..  మైనర్ తో  పాటు మరొకరు అరెస్ట్
  •     10 గ్రాముల గోల్డ్, 13వేల నగదు స్వాధీనం

శాయంపేట(ఆత్మకూర్​), వెలుగు: జైలు నుంచి వచ్చిన ఇద్దరు దొంగలు టీ షాపు వద్ద పరిచయమైన బాలుడికి జాబ్​ ఇప్పిస్తామని చెప్పి దొంగగా మార్చారు. ఇద్దరు నిందితుల వద్ద -10 గ్రాముల గోల్డ్,13వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఏసీపీ సతీశ్​బాబు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

తన్నిముట్టి సాయి, పాశం ప్రణిత్​చోరీ కేసుల్లో జైలుకెళ్లాక ఫ్రెండ్స్ అయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత టీ షాపు వద్దకు వెళ్లారు.  హనుమకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్​ఫస్ట్​ఇయర్​చదివే​కరీంనగర్​జిల్లా జమ్మికుంటకు చెందిన మైనర్​పరిచయమయ్యాడు. అతనికి జాబ్​ఇప్పిస్తామని చెప్పి నమ్మించి తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి హనుమకొండ  సిటీ అంతా తిరుగుతూ జల్సాలకు, మద్యానికి అలవాటుపడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. 

ఆత్మకూర్​మండలం కటాక్షాపూర్​వద్ద  పోలీసు చెక్​పోస్టు సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. బైక్ పై ముగ్గురూ వెళ్తండగా.. ఆపకపోవడంతో వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. గత జూన్​లోఆత్మకూర్​మండలం గుడెప్పాడ్​ రామాలయంలో రెండు బంగారు గంటెపుస్తెలు, వెండి జంజరం, రూ. వెయ్యి నగదు, దుగ్గొండి మండలం గర్నిబావిలోని వైన్​షాపు గ్రీల్స్​తొలగించి రూ.12వేల నగదు,  మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లి ముగ్గురు ఒప్పుకున్నారు. 

మైనర్​తో పాటు ప్రణిత్ ను పట్టుకోగా, సాయి పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద రూ. వెయ్యి నగదు, బంగారు, వెండి వస్తువులను, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆత్మకూరు సీఐ సంతోష్, ఎస్ఐ తిరుపతి, సతీశ్, హెడ్​ కానిస్టేబుల్​కుమారస్వామి, కానిస్టేబుల్​శ్రీనివాస్​లను ఏసీపీ అభినందించారు.