
- రూ. 20 లక్షల విలువైన ఈ- సిగరెట్లు, విదేశీ సిగరెట్లు స్వాధీనం
యాదాద్రి, వెలుగు: కస్టమ్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్న ఈ– -సిగరెట్లను కాల్చేందుకు ఇస్తే.. వాటిని అమ్మిన ఇద్దరిపై ఎస్ వోటీ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ట్రక్కుల ఈ–-సిగరెట్లు, విదేశీ బ్రాండ్ సిగరెట్లను శంషాబాద్ఎయిర్పోర్టులో కస్టమ్స్ఆఫీసర్లు పట్టుకుని, తగలబెట్టేందుకు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్‌కు గత జూన్13న ఇచ్చారు.
ఇండస్ట్రీస్ సూపర్ వైజర్ పల్లె శ్రీనివాస్.. వాటిలో370 ఈ– -సిగరెట్లు, విదేశీ బ్రాండ్ల 4,660 సిగరెట్ ప్యాకెట్లను అమ్మాడు. సమాచారం తెలియడంతో ఎస్వోటీ పోలీసులు భువనగిరిలోని ‘పాన్ ప్యాలెస్’లోని సయ్యద్ షరీఫ్ షాప్‌పై దాడి చేసి
13ఈ– -సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. షరీఫ్‌ను విచారించి.. పల్లె శ్రీనివాస్, ఇండస్ట్రీస్ ఎండీ అనిల్‌కుమార్ పై కేసు నమోదు చేశారు.