దొంగలు హల్ చల్.. క్షణాల్లో భక్తుల సొమ్ము గోవింద.. గోవిందా

దొంగలు హల్ చల్.. క్షణాల్లో భక్తుల సొమ్ము గోవింద.. గోవిందా

ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దొంగల హల్ చల్ చేశారు. భక్తుల సొమ్ములను క్షణాల్లో మాయం చేస్తున్నారు. సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.  ఇదే అదునుగా భావించిన దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. భక్తుల నుండి నగదును దోచుకున్నారు.  

ములుగు జిల్లాలోని గోవిందరావుపేట కి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆలయంలో  కోడె కట్టే క్రమంలో వారివద్ద నుండి డబ్బులు మాయం చేశారు. దీంతో వెంటనే బాధితుడు ఆలయ ఎస్పీఎఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఆలయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న వేములవాడకి చెందిన గణేష్, మంచిర్యాల సతీష్ ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 

వారి దగ్గిరి నుండి -- చంద్రశేఖర్ కు సంబంధించిన 9 వేల రూపాయలతో పాటుగా మరో 26 వేల రూపాయలను వారి నుండి స్వాధీనం చేసుకుని వారిపై పలు సెక్షన్ల కింద  కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.