గూడ్స్ రైల్లో అమెజాన్ పార్శిల్స్ చోరీ

గూడ్స్ రైల్లో అమెజాన్ పార్శిల్స్ చోరీ

లాస్ ఏంజెల్స్ కౌంటీ రైల్వే లైన్.. ఇది దొంగలకు అడ్డాగా మారిపోయింది. గూడ్స్ రైలు వచ్చిందంటే కంటెయినర్‎ను పగలకొట్టి.. అందులోని పార్శిల్స్‎ను ఎత్తికెళ్తారు. 2021లో ఇలా పార్శిల్స్‎ను ఎత్తుకెళ్లడం ద్వారా దాదాపు 37 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని యూనియన్ ఫసిఫిక్ తెలిపింది. లాస్ఏంజెల్స్ కౌంటీ రైల్వే.. ప్యాసింజర్లతో ఉండే బిజీ రూట్. దీంతో గూడ్స్‎తో వెళ్లే రైళ్లను ఈ మార్గంలో చాలా సేపు నిలిపివేస్తారు. ఇదే అదునుగా దొంగలు చెలరేగి పోతున్నారు.  తాజాగా లాస్ ఏంజెల్స్‎లో ఓ భారీ చోరీ జరిగింది. పోస్టల్ శాఖ పార్శిల్స్‎తో పాటు.. అమెజాన్, ఫెడ్ ఎక్స్, టార్గెట్, యూపీఎస్ లాంటి ఈ-కామర్స్ కంపెనీల పార్శిల్స్ చోరీకి గురయ్యాయి. అంతే కాదు చోరీ తర్వాత ఆ బాక్సులను పట్టాలపైనే పడేసి.. వాటిలో చాలా వరకు డబ్బాలను కాల్చిపడేశారు. 

లాస్ ఏంజెల్స్ రైల్వే రూట్‎లో దొంగతనాలు ఈ మధ్య కాలంలో జరుగుతున్నవి కాదు. 2020 డిసెంబర్ 2020 నుంచి ఈ తరహా దొంగతనాలు 160 శాతం మేర పెరిగాయని యూనియన్ ఫసిఫిక్ చెబుతోంది. గత అక్టోబర్ 2020తో పోలిస్తే.. అక్టోబర్ 2021లో ఈ దొంగతనాల శాతం 356 శాతం పెరిగిందని యూనియన్ ఫసిఫిక్ తెలిపింది. కరోనా టైం నుంచి ఈ నేరస్తులు చెలరేగిపోతున్నారు. పార్శిల్స్ ను మోసుకెళ్లడం కష్టమవుతుందనే ఉద్దేశంతో వాటిని అక్కడే చించేసి.. అందులోని వస్తువులను తీసుకెళ్తున్నారు. తక్కువ ధరకు బయట అమ్మేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్-19 కిట్స్, ఫర్నీచర్, మందులు.. చోరీకి గురవుతున్న వాటిలో ఎక్కువగా ఉన్నాయి. తాజాగా క్రిస్మస్, న్యూఇయర్ టైమ్‎లో ఈ తరహా చోరీలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యూనియన్ ఫసిఫిక్ ఆ రైల్వే రూట్‎లో భద్రత కట్టుదిట్టం చేసింది. డ్రోన్ పర్యవేక్షణతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని ట్రాక్‎లపై కాపలా పెట్టింది. అయినా కూడా దొంగతనాలు మాత్రం తగ్గడంలేదు. 

For More News..

పోలీస్ ఆఫీసర్‎గా ఒలింపిక్ విజేత

పాక్ సరిహద్దులో 1400 కిలోల భారత జాతీయ జెండా

పండగపూట గుర్రమెక్కిన బాలయ్య

కోడి పందెంలో ఓడిన కోడి ధర ఎంతో తెలుసా..