మానవ ముఖం కలిగిన వినాయకుడి ఒకేఒక్క ఆలయం ఉంది..ఎక్కడో తెలుసా?

మానవ ముఖం కలిగిన వినాయకుడి ఒకేఒక్క ఆలయం ఉంది..ఎక్కడో తెలుసా?

గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఏ ఆలయాల్లో చూసినా..వినాయకుడి విగ్రహం ఎక్కడ కనిపించినా..పెద్ద పెద్ద చెవులు, తొండం, ఏకదం తంతో ఏనుగు తలంతో చూస్తున్నాంకదా..కానీ విగ్రహానికి మానవ తల ఉన్న వినాయకుడి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ప్రపంచంలో ఇటువంటి ఏకైక దేవాలయం మనదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిలతర్పణపురి లో ఉంది.

ఈ విగ్రహం మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయం. ఇది ఏనుగు తల పెట్టకముందు గణేషుడి అసలు ముఖం అని నమ్ముతారు.అందుకే ఇక్కడ గణపతిని నరముఖ వినాయకుడిగా పూజిస్తారు. ఇది మనిషితలతో పోలిన వినాయకుడి విగ్రహం.

ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు,నడుము చుట్టూ నాగుపాము చుట్టబడి ఉంటుంది. గ్రానైట్ తో మానవ ముఖ వినాయకుడి విగ్రహాన్ని చెక్కారు.  ఓ చేత గొడ్డలి, మరో చేతి లో మోదకం ఉంటుంది. మోదకం జీవితంలోని ఆనందాలను చిహ్నం. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు.