జూడోలో ఇండియాకు మూడో మెడల్‌‌‌‌

జూడోలో ఇండియాకు మూడో మెడల్‌‌‌‌
  • స్క్వాష్‌‌లో బ్రాంజ్‌‌తో  సౌరవ్‌‌ కొత్త చరిత్ర
  • వెయిట్‌‌లిఫ్టింగ్‌‌లో లవ్‌‌ప్రీత్‌‌కు కాంస్యం

బర్మింగ్‌‌‌‌‌‌హామ్‌‌‌‌: కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండియా అథ్లెట్ల సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ కొనసాగుతూనే ఉంది. జూడోలో తులికా మన్‌‌‌‌ సిల్వర్‌‌‌‌తో మెరిస్తే.. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న స్క్వాష్‌‌‌‌లో స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ ఘోశల్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 78+ కేజీ ఫైనల్లో తులికా మన్‌‌‌‌ ’ఇప్పాన్‌‌‌‌ (1ఎస్‌‌‌‌2-10)తో సారా అడ్లింగ్టన్‌‌‌‌ (స్కాట్లాండ్‌‌‌‌) చేతిలో ఓడి రెండో ప్లేస్‌‌‌‌కు పరిమితమైంది. స్టార్టింగ్‌‌‌‌లో ప్రత్యర్థిని ఉడుంపట్టు పట్టిన ఇండియన్‌‌‌‌ జూడోకా.. చివరి నిమిషంలో పట్టు సడలించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌‌‌‌లో 22 ఏళ్ల తులికా ‘ఇప్పాన్‌‌‌‌ (10-1) ద్వారా సిడ్నీ ఆండ్రూస్‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌)పై గెలిచింది. స్టార్టింగ్‌‌‌‌లో వెనుకబడిన తులికా.. ‘ఇప్పాన్‌‌‌‌’లో సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసింది. మరోవైపు మెన్స్‌‌‌‌ 100 కేజీ రెప్‌‌‌‌చేజ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో దీపక్‌‌‌‌ దేస్వాల్‌‌‌‌.. టెవిటా టకవాయ (ఫిజి) చేతిలో ఓడి నిరాశపర్చాడు. జూడోలో ఇండియాకు ఇది మూడో మెడల్‌‌‌‌ కావడం విశేషం. సుశీలా దేవి (48 కేజీ), విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (60 కేజీ) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను నెగ్గారు. 

తొలి ప్లేయర్‌‌‌‌గా రికార్డు

 మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ ప్లే ఆఫ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ 15వ ర్యాంకర్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ 11–6, 11–1, 11–4తో జేమ్స్‌‌‌‌ లిల్‌‌‌‌స్ట్రాప్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌)పై గెలిచాడు. దీంతో స్క్వాష్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో తొలి మెడల్‌‌‌‌ గెలిచిన ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. సౌరవ్‌‌‌‌కు ఇది రెండో కామన్వెల్త్‌‌‌‌ మెడల్‌‌‌‌. 2018 గోల్డ్‌‌‌‌ కోస్ట్‌‌‌‌లో దీపికా పల్లికల్‌‌‌‌తో కలిసి మిక్స్‌‌‌‌డ్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అద్భుతమైన షాట్స్‌‌‌‌తో అలరించాడు. కోర్టు మొత్తం కలియదిరుగుతూ అన్ని రంగాల్లో సూపర్‌‌‌‌ షో చూపెట్టాడు. మరోవైపు మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో జోష్న చినప్ప-–హరీందర్‌‌‌‌ పాల్‌‌‌‌ సింగ్‌‌‌‌ సంధూ 8–-11, 11–-4, 11–-3తో కురుప్పు యాహిని–-రవీందు లక్సిరి (శ్రీలంక)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ ఫైనల్లో సునయన సారా కురువిల్లా11-–7, 13–-11, 11–-2 తో మేరి ఫంగ్‌‌‌‌ ఫాట్‌‌‌‌ (గయానా)పై గెలిచింది. 

లవ్‌‌ప్రీత్‌‌కు బ్రాంజ్‌‌

మెన్స్‌‌ 109 కేజీల్లో లవ్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌తో మెరిశాడు. ఫైనల్లో లవ్‌‌ప్రీత్‌‌ మొత్తం 355 (స్నాచ్‌‌ 163+ క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌ 192) కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌లో కొత్త నేషనల్‌‌ రికార్డును సృష్టించాడు. లుధియానాకు చెందిన 24 ఏళ్ల లవ్‌‌ప్రీత్‌‌.. స్నాచ్‌‌లో వరుసగా 157, 161, 163 కేజీలు ఎత్తాడు. దీంతో కెనడా లిఫ్టర్‌‌ అలెగ్జాండర్‌‌ బసెట్టీతో సంయుక్తంగా రెండో ప్లేస్‌‌లో నిలిచాడు. అయితే క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌లో మూడో ప్రయత్నంలో 192 కేజీలే లిఫ్ట్‌‌ చేయడంతో థర్డ్‌‌ ప్లేస్‌‌కు పడిపోయాడు. జూనియర్‌‌ నైబెయు (కామెరూన్‌‌) 361 కేజీల బరువు ఎత్తి గోల్డ్‌‌ మెడల్‌‌ నెగ్గాడు. సమోవా లిఫ్టర్‌‌ జాక్‌‌ హిటిలా ఒపెలోగ్‌‌ 358 కేజీల లిఫ్ట్‌‌తో సిల్వర్‌‌ సొంతం చేసుకున్నాడు. మరోవైపు విమెన్స్‌‌ 87+ కేజీల ఫైనల్లో పూర్ణిమా పాండే ఆరో ప్లేస్‌‌తో సరిపెట్టుకుంది. స్నాచ్‌‌లో 103, క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌లో 125తో కలిపి మొత్తం 228 కేజీల బరువు మాత్రమే ఎత్తింది. 

13 ఏళ్ల వయసు నుంచే..

తండ్రి టైలరింగ్‌‌‌‌ పని చేస్తుండటంతో.. చిన్నప్పుడు లవ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కూడా అదే పనిలోకి వెళ్లాలని భావించాడు. కానీ అతని ఫ్యామిలీ మాత్రం లవ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ను అథ్లెట్‌‌‌‌గా చూడాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. దీంతో లవ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ 13 ఏళ్ల వయసులో వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ను క్రీడాంశంగా ఎంచుకున్నాడు. డీఏవీ గ్రౌండ్‌‌‌‌లో ప్రాక్టీస్‌‌‌‌ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ‘ప్రతి అథ్లెట్‌‌‌‌ మాదిరిగానే నేను కూడా చాలా ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాను. ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నా. అయినా నా ఫ్యామిలీ చాలా అండగా నిలిచింది’ అని లవ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ పేర్కొన్నాడు. 2015లో నేవీలో జాయిన్‌‌‌‌ అయిన తర్వాత లవ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కెరీర్‌‌‌‌ ఒక్కసారిగా మారిపోయింది. పటియాలలోని నేషనల్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లో శిక్షణ తీసుకుంటూ ఆటపై పట్టు పెంచుకున్నాడు. 2017 కామన్వెల్త్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌తో పాటు ఆసియా జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. కెరీర్‌‌‌‌లో తొలి గేమ్స్‌‌‌‌ కావడంతో కాస్త ఒత్తిడికి లోనైన లవ్‌‌‌‌ప్రీత్‌‌‌‌.. మూడు కేజీల బరువు తేడాతో సిల్వర్‌‌‌‌ను కోల్పోయాడు.

కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేడు

అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌: విమెన్స్‌‌‌‌‌‌‌‌ హామర్‌‌‌‌‌‌‌‌ త్రో క్వాలిఫయింగ్‌‌‌‌‌‌‌‌– మ. 2.30, విమెన్స్‌‌‌‌‌‌‌‌  200 మీటర్లు హీట్స్‌‌‌‌‌‌‌‌-– మ. 3.30, మెన్స్‌‌‌‌‌‌‌‌ లాంగ్‌‌‌‌‌‌‌‌ జంప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌–రా. 12.12 . 
బాక్సింగ్‌‌‌‌‌‌‌‌: 51 కేజీ క్వార్టర్స్ అమిత్‌‌‌‌‌‌‌‌ పంగల్‌‌‌‌‌‌‌‌– సా. 4.45, 60 కేజీ లాంబోరియా–సా. 6.15. 92 కేజీ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌–సాగర్‌‌‌‌‌‌‌‌ అహ్లావత్‌‌‌‌‌‌‌‌–రా. 8 గంటలకు, 67 కేజీ రోహిత్‌‌‌‌‌‌‌‌ టోకాస్‌‌‌‌‌‌‌‌– రా. 12.30, హాకీ–ఇండియా X వేల్స్‌‌‌‌‌‌‌‌ 6.30, లాన్‌‌‌‌‌‌‌‌ బౌల్స్‌‌‌‌‌‌‌‌మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌–మ్రిదుల బొర్గోహైన్‌‌‌‌‌‌‌‌ సా. 4, స్క్వాష్‌‌‌‌‌‌‌‌: విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌–32,, 5.30, మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌–32,, సా. 6కు.