
భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్ సెప్టెంబర్ 2025లో చాలా బలంగా నిలిచింది. పండుగ సీజన్ డిమాండ్, అలాగే జీఎస్టీ (GST) కోత వల్ల ధరలు తగ్గడంతో కంపెనీలు బాగా లాభపడ్డాయి. దింతో దాదాపు అన్ని పెద్ద కంపెనీలు మంచి అమ్మకాలు నమోదు చేశాయి. హీరో మోటోకార్ప్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, మొత్తం ఉత్పత్తిలో 12 కోట్ల అమ్మకాలు దాటిన మొదటి ద్విచక్ర వాహన కంపెనీగా కూడా నిలిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్, సుజుకి వంటి బ్రాండ్‌లు కూడా ఇదే నెలలో అత్యధిక అమ్మకాలు సాధించాయి.
టాప్లో హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ అమ్మకాలు: హీరో మోటోకార్ప్ మొత్తం 6,87,220 యూనిట్లను అమ్మింది, ఇది సెప్టెంబర్ 2024తో పోలిస్తే 8% ఎక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పండుగ సందడి రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. ఇక ఎగుమతులలో కూడా హీరో మంచి రికార్డు నమోదు చేసింది, సెప్టెంబర్‌లో 39,638 యూనిట్లను అమ్మడం ద్వారా గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 94.8% వృద్ధిని సాధించింది.
ఇతర కంపెనీలు:
హోండా (Honda): 5,68,164 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో ఉండగా... ఇందులో 5,05,693 యూనిట్లు దేశీయంగా అమ్మింది.
టీవీఎస్ (TVS): 5,23,923 యూనిట్ల అమ్మకాలతో 11% వృద్ధిని చూపింది. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ వాహనాలలో (ఐక్యూబ్, ఆర్బిటర్) 31,266 యూనిట్లు అమ్మి వరుసగా ఆరో నెల కూడా ఈ విభాగంలో మొదటి స్థానంలో ఉంది.
బజాజ్ (Bajaj Auto): 4,30,853 యూనిట్ల అమ్మకాలతో 8% వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా ఎగుమతుల్లో బజాజ్ స్థిరమైన వృద్ధిని కొనసాగించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield): చరిత్రలోనే అత్యధిక ప్రతినెల అమ్మకాలు 1,24,328 బైకులను అమ్మింది, ఇది 43% భారీ పెరుగుదల.
సుజుకి (Suzuki): సుజుకి కూడా 1,23,550 అమ్మకాలతో అత్యుత్తమ ప్రతినెల పనితీరును నమోదు చేసింది, ఇది 25% వృద్ధి.
ఈ విధంగా సెప్టెంబర్ 2025లో హీరో మోటోకార్ప్ అత్యధికంగా ద్విచక్ర వాహనాలను అమ్మిన కంపెనీగా నిలిచింది.