
ఉత్తర భారత రాష్ట్రం హర్యానాలో హిందువుల పవిత్ర నగరం కురుక్షేత్ర పురాణ నగరం ఉంది. మహాభారతంలో పాండవులు, కౌరవుల మధ్య జరిగిన గొప్ప యుద్ధం ఇక్కడ జరిగినట్లు నమ్ముతారు. భగవద్గీతలో డాక్యుమెంట్ చేయబడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు తన దివ్య జ్ఞానాన్ని అందించాడని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కురుక్షేత్ర భూమి అనేక దేవాలయాలకు నిలయంగా ఉంది. వీటిలో చాలా వరకు మన ఇతిహాసాలకు సంబంధించినవి. ఈ ఆలయాలకు రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వీటిలో ఒక దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలు విధించారు.
నిజానికి, ఈ ఆలయం స్త్రీలకు అత్యంత అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. వారు ఆలయంలోకి అడుగుపెడితే వారు వితంతువులు అవుతారని శపిస్తారు. ఈ ఆలయం ధర్మనగరి కురుక్షేత్రానికి 20 కి.మీ దూరంలో పెహోవాలో ఉంది. శంకరుడి కుమారుడైన కార్తికేయకు ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ ప్రసిద్ధ దేవాలయం హర్యానా ప్రావిన్స్‌లోని కురుక్షేత్ర జిల్లాలో పెహోవా నడిబొడ్డున ఉంది. ఢిల్లీకి 2వందల కిలోమీటర్ల దూరంలో, కర్నాల్ పెహోవా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. హర్యానా, పంజాబ్ మధ్య సరిహద్దులో ఇది పంజాబ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా ఉంటుంది.
ఈ ఆలయంలో కార్తికేయుడు బ్రహ్మచారి రూపాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల మహిళలకు ప్రవేశం లేదు. కార్తికేయ ఆలయంలోకి ప్రవేశించిన స్త్రీ ఏడు జన్మల పాటు వితంతువుగా ఉంటుందని నమ్ముతారు. ఈ నమ్మకాన్ని ప్రస్తావిస్తూ, ఆలయం వెలుపల ఒక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. స్థానిక మఠాధిపతి ఇదే విషయాన్ని సందర్శించే మహిళలకు తెలియజేయాలని ఆదేశించారు.
కార్తికేయ మహారాజ్ ఆలయంలో సాంప్రదాయకంగా వస్తోన్న ఆచారం ప్రకారం ఆవనూనె ప్రసాదాలను స్వీకరిస్తారు. స్వామి వారికి ఆవనూనె పూయడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం, కార్తికేయ తల్లి పార్వతిపై కోపంతో తన మాంసాన్ని, రక్తాన్ని బలి ఇచ్చాడు. శంకరుడి ద్వారా పెహోవా తీర్థయాత్రను సందర్శించమని అతనికి సూచించినట్టు చెబుతారు. కార్తికేయుడు మండుతున్న శరీరాన్ని చల్లబరచడం కోసం ఋషులు ఆవనూనెను ఆయనకు పూసినట్లు ఇక్కడి వారు అంటుంటారు.