అది అపార్టెమెంట్ కాదు..ఓ చిన్నపాటి నగరం..

అది అపార్టెమెంట్ కాదు..ఓ చిన్నపాటి నగరం..

అద్భుత దృశ్యం,  ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి చెందుతున్న సామాజిక ఆర్థిక కమ్యూనిటీ  స్ఫూర్తితో వాస్తుపరంగా ప్రత్యేకమైన అపార్టుమెంట్లతో నివసించాలని మనలోచాలా మంది కలలు కంటుంటారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో అలాంటి దానినే చూపిస్తుంది. చైనాలోని హంజ్ జౌలోని రీజెంట్ ఇంటర్నేషనల్ భవనం, 20వేల మంది నివస్తున్న ఈ భవనం ఓ చిన్న నగరాన్ని తలపిస్తుంది. 

ఆధునిక వాస్తు శిల్పానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ ఎత్తయిన నిర్మాణం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయంగా మారింది. ఇక్కడ అన్ని రకాల మనుషులు జీవనం కొనసాగిస్తున్నారు. ఉన్నోడు లేనోడు అనే బేధం లేకుండా ఈ భవనంలో  20 వేల మంది నివాసం ఉంటున్నారు. 

S ఆకారంలో ఉండే ఈ భవనంలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. భవనంలో ఉన్నవాల్లే అన్ని  తమకు కావాల్సినవి ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తయారు చేసే వాళ్లు వారే.. అమ్మేవాళ్లు వారే.. కొనేవారే వాళ్లు వారే అన్నమాట. ఈ భవనంలో లేని సౌకర్యం అంటూ లేదు.  ఇంటర్నెట్, షాపింగ్ మాల్స్, కిరాణా దుకాణాలు ఇలా మనిషికి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 

రీజెంట్ ఇంటర్నేషనల్ భవనంలో పట్టణ జీవనానికి వినూత్న విధానం, నివాస, వాణిజ్య, వినోద ప్రదేశాలను ఈ భవనంలో ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.