క్యాప్షన్ పెట్టండి.. మహీంద్రా స్కేల్ మోడల్ కారు గెలుచుకోండి

క్యాప్షన్ పెట్టండి.. మహీంద్రా స్కేల్ మోడల్ కారు గెలుచుకోండి

మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సమకాలీన అంశాలపై స్పందిస్తూ ఎప్పుడూ నెటిజన్ల మన్ననలు పొందుతూ ఉంటారు.

తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకి తగ్గట్లు మంచి క్యాప్షన్ రాసిస్తే బహుమతి లభిస్తుందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

డీటీహెచ్ యాంటీనాపై ఓ కోతి తిష్టవేసింది. ఆఫోటోకు చక్కని క్యాప్షన్ పెడితే రెండు మహీంద్రా స్కేల్ మోడల్ కారు ఇస్తానని తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌లో క్యాప్షన్ పంపించవచ్చు. అక్టోబర్ 11, మధ్యాహ్నం 2 గంటలలోపు క్యాప్షన్స్ పంపించాలి  అని కోరారు. ప్రస్తుతం ఆ ఫోటోపై ఔత్సాహికులు క్యాప్షన్ పెట్టేందుకు కుస్తీలు పడుతున్నారు. మీరూ ట్రై చేయండి.మహీంద్రా స్కేల్ మోడల్ కారును సొంతం చేసుకోండి.

స్కేల్ మోడల్ కారు అంటే  

విజేతకు స్కేల్ మోడల్ కారు వస్తుందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో స్పష్టంగా రాశారు. స్కేల్ మోడల్‌ కారంటే   చిన్న బొమ్మలాంటి కారని అర్ధం. ఈ కారు బొమ్మ మాత్రమే..కానీ నిజమైన కారులాగే ఉంటుంది. క్యాప్షన్ విజేతకు లక్షల విలువైన కారు లభించదు. స్కేల్ మోడల్ మాత్రమే. కొన్ని వేలుమాత్రమే ఖర్చవుతాయి.