ఈ చెస్ బోర్డు లక్షా 40 వేలు.. స్పెషల్ ఏంటీ..?

ఈ చెస్ బోర్డు లక్షా 40 వేలు.. స్పెషల్ ఏంటీ..?

కొంత మంది తమక్కావల్సిన వస్తువులపై ఎంత ఖర్చయినా పెట్టేందుకు వెనుకాడరు. బ్రాండ్, క్వాలిటీ విషయం అత్యంత ఖచ్చితంగా ఉంటారు. ఏం కొన్నా ప్రత్యేకంగా, విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. అందులో క్లాసీ షూస్, బ్యాగ్‌లు, సిగ్నేచర్ హై హీల్స్ లేదా స్కార్ఫ్ లాంటి విలాసవంతమైన వస్తువులేమైనా ఉండొచ్చు. అలాంటి వారి కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఓ దుకాణం ఉంది. ఇక్కడ వస్తువులు అత్యంత కాస్ట్లీగా ఉంటాయి.

అందులో భాగంగానే తాథేరి మార్కెట్‌లో ఉన్న ఈ నితిన్ జ్యువెలర్స్ అనే దుకాణం ఇటీవలే రూ.1.40 లక్షల విలువైన చెస్ గేమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ చదరంగం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని వెండితో తయారు చేశారు. బంగారు పూతతో కూడిన చదరంగం పీసెస్ లను కలిగి ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు గల కారణంపై స్పందించిన షాపు యజమాని.. తనకు ఇంత ప్రత్యేకమైన ఆర్డర్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ చెస్‌బోర్డ్ ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి చేయబడుతుందని, చెస్ ముక్కలు సాధారణ వెండితో కాకుండా, 22 క్యారెట్ల వెండితో తయారు చేయబడతాయని కూడా అతను చెప్పాడు.

చదరంగం పావులను తయారు చేసేందుకు దాదాపు 1.5 కిలోల వెండిని ఉపయోగిస్తారని నితిన్ తెలిపాడు. ఈ వార్త ఆన్‌లైన్‌లో షేర్ కావడంతో చాలా మంది చెస్ ఔత్సాహికులు వీటిని ఇష్టపడుతున్నారని, క్యారమ్ బోర్డ్, లూడో లాంటి ఆర్డర్‌లు ఇంతకు ముందు తమకు అందాయని, కానీ చెస్ గేమ్‌ను డిమాండ్ చేయడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న గోరఖ్‌పూర్, అజంగఢ్, బలియా, రాబర్ట్‌గంజ్, వారణాసిలోని సమీప ప్రాంతాల నుంచి కూడా తమకు ఆర్డర్లు అందుతున్నాయని ఆయన చెప్పారు.